జగన్ కి పట్టుదల ఉందంటారు. అయితే గిట్టని వారు మొండితనం అంటారు. ఎవరు ఎన్ని అనుకున్నా జగన్ మాత్రం తన పని తాను చేసుకుని పోతారు. ఆయన తాను అనుకున్న దాని విషయంలో ఎక్కడా రాజీ పడనే పడరు. జగన్ అనుసరించిన ఈ విధానం వల్ల లభం జరిగిందా నష్టం జరిగిందా అంటే ఎక్కువ నష్టమే జరిగిందని చెప్పాలి. లేకపోతే జగన్ ఏనాడో ఉమ్మడి ఏపీకే సీఎం అయ్యేవారు.


జగన్ బంపర్ మెజారిటీతో నవ్యాంధ్రకు సీఎం అయ్యారు. బాగానే ఉంది. తనని నమ్మి ఓటేసిన జనాలకు జగన్ ఎంతమేరకు ఆశలు నెరవేరుస్తున్నాడన్నది ఒక్కసారి పరిశీలిస్తే అసంత్రుప్తే సమాధానం గా వస్తుంది. జగన్ హమీల అమలు కోసం చర్యలు తీసుకుంటున్నా వాటి ఫలితాలు ఇంకా జనానికి  చేరలేదు. క్షేత్ర స్థాయిలో పరిస్థితి అలాగే ఉంది. అధికారుల మీద అధారపడి జగన్ బాబు చేస్తున్న తప్పులనే  చేస్తున్నారు.


ఇక రివర్స్ టెండరింగ్ పేరు మీద జగన్ చేస్తున్న విన్యాసాలు కూడా ఏపీకి నష్టం చేకూర్చేవే పది పైసలు మిగులుతుందని జరుగుతున్న పనులను ఆపి రివర్స్ టెండరింగ్ కి వెళ్తే అక్కడ సమయంతో పాటు రేపటి రోజున  పది రూపాయలు అదనంగా నష్టపోవాల్సివస్తోంది. పోలవరం ఇష్యూలో జగన్ కేంద్రంతోనే తలపడుతున్నారు. చివరికి ఇది ఎటు వైపు దారి తీస్తుందోనని అంతా హడలిపోతున్నారు. 


కేంద్రం ఎలాగూ పోలవరం పూర్తి చేయడం ఇష్టం లేకపోతే ఆ బండను జగన్ మీద వేసి సులువుగా తప్పుకుంటుంది. అపుడు ఏపీ కలల పోలవరం మాటెమిటి. జాతి జనుల ద్రుష్టిలో జగన్ జీవిత కాలం దోషిగా మిగిలిపోక తప్పదు. ఇక గోదావరి, క్రిష్ణా వరదల సమయంలో ఆపన్నులకు అండగా నిలవాల్సిన ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలు చేయడం ముమ్మాటికీ తప్పే. 


ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ అయినా రాజుకు మొదట ప్రజలే ముఖ్యం. ఆ తరువాతే మరేదైనా. ఆ విషయంలోనూ జగన్ కోరి చెడ్డ అవుతున్నారు. మొత్తానికి  మూడు నెలలు పూర్తి అవుతున్న జగన్ పాలన అంతా నా ఇష్టం అన్న ధోరణిలో సాగుతోంది. దీని వల్ల జనానికి కష్టం వస్తే మాత్రం భారీఎత్తున రాజకీయ  నష్టం వైసీపీకి తప్పదని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: