ఎన్నిచట్టాలు తెస్తున్న, ప్రపంచ దేశాలు గగ్గోలుపెడుతున్న,శాంతి సందేశాలెన్ని వినిపిస్తున్న ఉగ్రవాదులచెవికి ఎక్కడం లేదు.వారి అనాలోచిత నిర్ణయాల వల్ల,ఆవేశపూరితమైన దూకుడువల్ల విధ్వంసాలెన్నో సృష్టించ బడుతున్నాయి. మరణహోమాలు జరుగుతున్నాయి.చంపాలనుకున్న వాడికి చావంటే భయం వుండకూడదనే సినిమా డైలాగులను ఉగ్రవాదులు లైవ్ లో చూపిస్తున్నారు.ఒక్కసారి డేట్ ఫిక్స్ చేస్తే అదిపెళ్ళివేడుకైన,యాత్రస్దలమైన,ప్రయాణప్రాంగణమైనా హోటల్స్ ఐనా ఒక్కటే,వారిలో మానవత్వం మచ్చుకైన కనబడదు.



జాలిలేని ఈ ముష్కరులు అఫ్గాన్ రాజధాని కాబుల్ నగరంలోని వెడ్డింగ్ హాలులో బాంబుపేల్చి 63మందిని చంపగా 180మందికి పైగా గాయాలు చేసారు.స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10గంటల40 నిమిషాలకు కాబుల్ నగరంలోని వెడ్డింగ్ హాలులో పెళ్ళి వేడుకలు జరుగుతుండగా అనుకోని అతిధిలా ఓ మానవబాంబు హాలులోకి వచ్చి తనను తాను పేల్చుకున్నాడని,ప్రత్యక్ష సాక్షులు తెలిపారట.ఇక ఈ పేలుడు షియా ముస్లింలు అధికంగా ఉన్న ప్రాతంలో చోటు చేసుకుంది.ఈ దాడికి ముందు పదిరోజులకిందట కాబూల్‌లోని ఒక పోలీస్ స్టేషన్ వెలుపల భారీబాంబు దాడిజరిగింది.ఆ ఘటనలో 14మంది చనిపోగా దాదాపు 150 మంది వరకు గాయపడ్డారట.ఈ దాడి తమ పనే అని తాలిబాన్ ప్రకటించుకుంది..



కాని పెళ్ళి వేడుకలో జరిగిన ఈ దాడివిషయంలో ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్ద ఎలాంటి ప్రకటన చేయలేదు..ఇక హోం శాఖ ప్రతినిధి నస్రత్ రహిమి ఈ బాంబుపేలుడులో ప్రాణనష్టం జరిగిందని ధ్రువీకరించారు.కానీ ఇంకా ఘటన గురించి పూర్తి వివరాలు తెలియలేదన్నారు.విషయం ఏంటంటే అఫ్గాన్ వివాహవేడుకలకు తరచూ వందలాది అతిథులు హాజరవుతారు. ఆవేడుకలకు వచ్చే పురుషులకు,మహిళలకు,పిల్లలకు ఏర్పాటుచేసిన హాల్స్ వేరు వేరుగా వుండేలా చూస్తారట.ఈ వివాహానికి వచ్చిన మహమ్మద్ ఫర్హాగ్ అనే అతిథి తాను మహిళల విభాగంలో ఉన్నప్పుడు "పురుషులుఉన్నహాల్లో భారీపేలుడుశబ్దం విన్నానని,బయట అందరూ అరవడం,ఏడవడం వినిపించిందనిచెప్పారు.దాదాపుగా 20 నిమిషాలు ఆ హాల్లో పొగ నిండిపోయింది. అక్కడున్న మగవాళ్లందరూ గాయపడ్డారు.వారిలో కొంతమంది చనిపోయారని చెప్పారు.



ఇకపోతే తాలిబన్లు,అమెరికా ప్రతినిధుల మధ్య కతార్ రాజధాని దోహాలో శాంతిచర్చలు నడుస్తున్నాయని ఈ చర్చల్లో కాస్త పురోగతి కనిపిస్తుందని చెబుతున్నారు..అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కూడా "వీలైతే రెండు పక్షాలూ ఒక ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నట్లు ట్వీట్ చేశారు.ఈ ఒప్పందంలో భాగంగా మిలిటెంటు దళాలు అమెరికాపై దాడులు చేసేందుకు ఆఫ్గానిస్తాన్‌ను ఉపయోగించబోమని తాలిబన్లు గ్యారంటీ ఇస్తే, దానికి బదులు అమెరికా తమ దళాలను అక్కడి నుంచి ఉపసంహరిస్తుంది తెలిపాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: