తెలుగు సినిమారంగంలో చిరంజీవిది నలభయ్యేళ్ల కష్టం. చిన్న పాత్రలో తెర మీద కనిపించి సూపర్ స్టార్ డం కి చేరుకోవడం ఒక్క మెగాస్టార్ వల్ల మరెవరి వల్ల కాదంటారు. కఠొర శ్రమతోనే చిరంజీవి తాను అనుకున్న ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. చిరంజీవి మేకప్  వేస్తే ఆయనే ఎప్పటికీ నంబర్ వన్ అనేవారు దివంగత దాసరి నారాయణరావు. ఇపుడు సినిమాల్లో చిరంజీవి అదే జోరు చూపిస్తున్నారు. మరి ఆయన రాజకీయం మాటేంటి.


అంటే ప్రస్తుతానికి సినిమాలే అంటున్నారు మెగాస్టార్. ఆయన ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో తన మనసులో భావాలను పంచుకున్నారు. తనని ఓ పెద్ద పార్టీ సంప్రదించడం జరిగిందని ఒప్పుకున్న చిరంజీవి తాను స్పందించలేదని అన్నారు. ఆ పెద్ద పార్టీ బీజేపీ అన్న సంగతి వూహాగానంగా ఉంది. రాజకీయాల్లో ఉంటే తన శరీరం తన అదుపులో లేదని ఓ విధమైన నెగిటివ్ కామెంట్ చేసిన చిరంజీవి ప్రస్తుతానికి సినిమాలు అంటూ కామా పెట్టడంతోనే రాజకీయాల్లో చర్చ ఓ స్థాయిలో  సాగుతోంది.


ఇక తమ్ముడు జనసేనపై ఇప్పటివరకూ ఎక్కడా మాటమాత్రంగానైనా తన అభిప్రాయం చెప్పని చిరంజీవి ఆ ఇంటర్వ్యూలో మాత్రం తన తమ్ముడు ఓడిపోయినా పోరాటం ఆపడని అన్నారు. పవన్ పోరాట యోధుడు అంటూ కితాబు ఇచ్చారు. అలా పోరాడుతూంటే ఎప్పటికైనా విజయం తప్పక దక్కుతుందంటూ జనసేనకు  మంచి భవిష్యత్తు ఉందని చెప్పకనే చెప్పారు. మొత్తానికి ఇది పవన్ అభిమానులకు సంతోషపెట్టే వార్తే మరి. మరి తమ్ముడు పార్టీని పొగిడిన చిరంజీవి తాను రాజకీయాల్లోకి ఎప్పటికైనా వస్తారా అంటే  రావచ్చేమోనని రాజకీయ పండితులు అంటున్నారు.  ఐతే చిరంజీవి రాజకీయల్లోకి వస్తే జనసేనలో చేరుతారా లేక బీజేపీలోకి వెళ్తారా అన్న చర్చ కూడా నడుస్తోంది. మరి ఈ విషయంలో కూడా క్లారిటీ చిరంజీవి నుంచే మరో మారు వస్తుందేమో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: