ఆగస్టు 5 వ తేదీ ముందు వరకు ఒకటి.. ఆగష్టు 5 తరువాత మరొకటి.  ఇంకా చెప్పాలంటే మోడీ ప్రధాని కాకా ముందు ఒకటి.. ప్రధాని అయ్యాక ఇండియాలో జరుగుతున్నా మార్పులు మరొకటి.  ఇండియా స్పీడ్ గా అభివృద్ధి చెందుతోంది.  అంతేకాదు, ఇచ్చిన హామీలను ఇచ్చినట్టుగా ఎంత కష్టమైనా సరే అమలు చేయడానికి రెడీ అవుతున్నది.  దానికి ఒక ఉదాహరణ తలాక్ బిల్లు.  


మోడీ మొదటిసారి ఎన్నికయ్యాక తలాక్ బిల్లును ప్రవేశపెట్టింది.  కానీ, రాజ్యసభలో సంఖ్య తక్కువుగా ఉండటంతో.. రాజ్యసభలో బిల్లు చట్టం కాలేకపోయింది.  అయితే, రెండోసారి మోడీ ప్రభుత్వం వస్తుంది అని అనుకున్నా.. భారీ స్థాయిలో విజయం సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు.  గతంలో కంటే ఎక్కువ సీట్లు ఇచ్చి గెలిపించారు. దీంతో రాజ్యసభలో బీజేపీ సంఖ్య పెరిగింది.  


దీంతో అనుకున్నట్టుగా మొదట త్రిపుల్ తలాక్ బిల్లును ప్రవేశపెట్టి చట్టబద్దం చేశారు.  త్రిపుల్ తలాక్ ప్రవేశపెట్టిన కొన్నిరోజులకే.. ఆర్టికల్ 370ని రద్దు చేసి అందరికి షాక్ ఇచ్చారు.  కాంగ్రెస్, కొన్ని పార్టీలు మినహా మిగతా పార్టీలు బీజేపీకి మద్దతు ఇచ్చాయి.  అయితే, కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని ఉన్నా ఇవ్వలేకపోయాయి.  


కారణం ఏంటి అంటే.. కాంగ్రెస్ పార్టీలో ఉండటమే.  అప్పుడు సైలెంట్ గా ఉన్న నేతలు.. ఒక్కొక్కరుగా బయటకు వచ్చి బిల్లును సమర్ధించడం మొదలుపెట్టారు.  అంతేకాదు, కాంగ్రెస్ పార్టీని వదిలి బీజేపీలో జాయిన్ అవుతున్నారు.  కారణం ఏంటి అంటే.. కాంగ్రెస్ పార్టీలో ఉంటె ఎప్పటికి ముందుకు అడుగువేయలేము.  అదే బీజేపీలో ఉంటె గర్వంగా ఏదైనా చెయ్యొచ్చు.  


ఇదిలా ఉంటె, కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎంత భూపేంద్ర హుడా బీజేపీని ఆకాశానికి ఎత్తాడు.  మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అద్భుతమని పొగడ్తల వర్షం కురిపించారు.  జమ్మూ కాశ్మీర్ పై తీసుకున్న నిర్ణయం సరైదనే అని చెప్పారు.  ప్రభుత్వం ఏదైనా మంచి పని చేస్తే దాన్ని తప్పకుండా స్వాగతిస్తానని స్పష్టం చేశారు. దేశభక్తి, ఆత్మగౌరవం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. ఆర్టికల్ 370రద్దు విషయంలో కాంగ్రెస్ వైఖరిని తప్పుబట్టిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ గాడి తప్పిందని విమర్శించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: