భారతీయ జనతా పార్టీ...ఇప్పుడు దేశంలోనే అతి పెద్ద రాజకీయ శక్తి. ఉత్తరాదిన ఏలుతున్న కమలనాథుల కన్ను ఇప్పుడు దక్షినాది పైన పడింది. కర్నాటకలో పరిస్థితులు చక్కబెట్టాక ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయాలని చూస్తున్నారు మోడీ గ్యాంగ్. తెలంగాణలో ఇప్పటికే ఆ దిశగా పనులు ముమ్మరం చేశారు. కానీ ఆంధ్రలో అంత ఈజీ కాదని వారికి ఇప్పటికే అర్ధమయింది. అక్కడి రాజకీయ పరిస్థితులకి ఇక్కడి వాటికి చాలా తేడా ఉంది. తెరాస పై ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేక భావన వచ్చింది. కానీ ఏపీ లో కథ వేరు. అంతా జగన్ జపమే.  

అతనిని ఎదురుకునేందుకు మోడీ సరికొత్త ప్లాన్ తో వచ్చాడు. బీజేపీ టార్గెట్ చేసేందుకు ఏపీలో బలమైన.. ప్రజాకర్షణ కలిగిన నాయకుడితో పాటు.. క్రౌడ్ పుల్లింగ్ నేతలు ఒక్కరంటే ఒక్కరు కూడా ఏపీ బీజేపీకి లేరు. అందుకే స్టార్ ఇమేజ్ కలిగిన కొణిదెల బ్రదర్స్ వైపు బిజేపీ గురి పెట్టింది. అదీ కాకుండా వారు బలమైన సామజిక వర్గానికి చెందిన వారు కూడా.

అయితే అక్కడ బీజేపీ పాచికలు మాత్రం ఏ మాత్రం పారలేదు, ఈ మధ్యనే చిరు ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఒక ప్రముఖ రాజకీయ పార్టీ తనను వారి పార్టీలోకి చేరమని కోరినట్లు ఆయన చెప్పాడు. అయితే.. తాను ఇప్పుడు దాని మీద స్పందించలేను అని చెప్పాడు. తాను కేవలం సినిమాల పైనే ఫోకస్ పెట్టానని స్పష్టం చేశాడు.

కానీ పవన్ మాత్రం ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నాడు. తనని పార్టీని విలీనం చేయమని చాలా మంది ఒత్తిడి చేస్తున్నారని ఆయన ఇన్ డైరక్ట్ గా భాజపా గురించి చెప్పాడు.

కానీ తాను మాత్రం పార్టీని విలీనం చేసే ప్రసక్తే లేదని కుండబద్ధలు కొట్టిన ఆయన.. తన పక్కన ఒక్కరు ఉన్నా తన తుదిశ్వాస విడిచిపెట్టే వరకూ జనసేనను నడిపిస్తానన్నారు. తనను అదే పనిగా అడుగుతూ.. పార్టీని విలీనం చేయాలన్న మాట చెబుతున్నారని.. అదే రీతిలో పార్టీని విలీనం చేసే ప్రసక్తే లేదన్నారు. 


అన్నయ్య తగ్గి నెగ్గితే....తమ్ముడు మాత్రం రఫాడించేశాడు. ఇలా అన్నదమ్ములిద్దరూ వారి సినీ క్యారెక్టర్లకు భిన్నంగా భాజపాకు స్రైన బదులిచ్చారు. అయితే కుర్చీలాటలో ఆరితేరిపోయిన మోడీ అండ్ కో వేరే మార్గం ఏమి వెతుక్కుంటుందో చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: