తెలంగాణలో భారతీయ జనతా పార్టీ దూకుడు ప్రదర్శిస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉండటంతో రాష్ట్రంలో బలపడేందుకు అదిరిపోయేలా ఎత్తులు వేస్తూ ముందుకు వెళుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో టీడీపీ నేతలనీ పూర్తిగా లాగేసుకుంటుంది. అటు కొందరు కాంగ్రెస్ నేతలకి కూడా కాషాయ కండువా కప్పేద్దామని చూస్తోంది.  ఈ క్రమంలోనే అధికార టీఆర్ఎస్ పార్టీకి కూడా బీజేపీ దడ పుట్టిస్తుంది. ఆ పార్టీలో ఉన్న అసంతృప్తి నేతలని కూడా టార్గెట్ చేసుకుని కేసీఆర్ కి షాక్ ఇవ్వాలని చూస్తోంది.


అందుకు తగ్గట్టుగా బీజేపీ నేతలు కూడా సంచలన ప్రకటనలు చేస్తున్నారు. సెప్టెంబర్ 17న అమిత్ షా తెలంగాణ వస్తున్నారు. అప్పుడు మేము ఏంటో చూపిస్తాం అంటున్నారు. నిన్న కర్ణాటక, నేడు తెలంగాణ అంటూ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం అని అర్ధం వచ్చేలా మాట్లాడుతున్నారు. అయితే భారీ మెజారిటీతో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చడం సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఆ విషయాన్ని పక్కనబెడితే బీజేపీ..టీఆర్ఎస్ ని వీక్ చేసే ప్రయత్నాలు చేసే మాత్రం చేస్తున్నట్లు తెలుస్తోంది.


ఇప్పటికే బీజేపీ అగ్రనేతలు పలువురు టీఆర్ఎస్ అసంతృప్త నేతలతో మంతనాలు జరుపుతున్నారు. త్వరలోనే వారిని పార్టీలోకి  లాగేసుకుంటారని సమాచారం. అదేవిధంగా ఇంకా చాలామంది టచ్ లో ఉన్నారని చెబుతున్నారు. అటు తమ నాయకత్వంతో పలువురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు టచ్‌ లో ఉన్నారని కేంద్ర మంత్రి జి. కిషన్‌ రెడ్డి, బిజెపి తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్‌ కె. లక్ష్మణ్‌, సీనియర్‌ నేత బండారు దత్తాత్రేయ బహిరంగ వేదిక మీద నుంచే ప్రకటనలు చేస్తున్నారు. 


మరి ఎమ్మెల్యేలు ఎవరు టచ్ లో ఉన్నారో బీజేపీ నాయకులే చెప్పాలి. ఏది ఏమైనా బీజేపీ 2023 ఎన్నికలని టార్గెట్ చేసుకుని ముందుకు వెళుతున్నట్లు కనపడుతుంది. అప్పటికి టీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయంగా ఎదిగి అధికారం చేజిక్కించుకోవాలని చూస్తోంది. మొత్తం మీద బీజేపీ మాత్రం కేసీఆర్ కి దడ పుట్టిస్తుందనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: