ప్రభుత్వంపై  ప్రజా వ్యతిరేకత  సొమ్ము చేసుకుందాం

 తెలంగాణ   లో కెసిఆర్  ప్రభుత్వం పై ఉన్నా ప్రజా వ్యతిరేకత  మనకి ఆయుధం గా మారి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పాగా వేసే విధంగా  పార్టీ శ్రేణులు పనిచేయాలని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్య నిర్వాహక అధ్యక్షుడు శ్రీ  జగత్ ప్రకాష్ నడ్డా పార్టీ కమిటీ సమావేశంలో వూద్బోధించారు. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర  భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ సమన్వయం తో పనిచేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్న లక్ష్యాన్ని  సాధించి తీరాలని శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు.

‘నమో భారత్‌- నవ తెలంగాణ’ నినాదంతో తెలంగాణ లో పార్టీ శ్రేణులు పనిచేయాలని  సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ప్రజలను భారతీయ జనతా పార్టీ వైపు తిప్పుకోవాలని ఆయన అన్నారు.  ఈ పనిలో పార్టీ శ్రేణులు వేసే అడుగే కీలకమని దానిద్వారా మాత్రమే భవిష్యత్తులో తెలంగాణ భారతీయ జనతా పార్టీ ప్రభావం ఆధారపడి ఉంటుందని  శ్రీ నడ్డా కోర్ కమిటీ సమావేశంలో తెలియజేశారు. ప్రతి 15 రోజులకు ఒకసారి కోర్ కమిటీ సమావేశం నిర్వహించుకోవాలని తద్వారా మన బలాబలాలు విశ్లేషించుకోవడానికి వీలవుతుందని,  లక్ష్యాన్ని చేరుకునే దిశగా మానవ ప్రయత్నాలు ఏ స్థాయిలో ఉన్నాయో బేరీజు వేసుకునే అవకాశం పార్టీ శ్రేణులకు లభిస్తుందని శ్రీ శ్రీ  జగత్ ప్రకాష్  నడ్డా అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: