మన భారతదేశం లోని ఉత్తరప్రదేశ్ చెందిన గోరఖ్ పూర్ గ్రామపంచాయితీ పెద్దలు ఈ వింత తీర్పు ను ఇచ్చారు. ఈ తీర్పు పై ఒక పోలీస్ కేసు నమొదు అయ్యింది. ఈ కేసు ను ఆరా తీసిన పోలీసులకు కోన్ని షాకింగ్ విషయలు తెలిసాయి.వివరల్లోకి వెళితే గోరఖ్ పూర్ గ్రామానికి చెందిన రాజేష్ పాల్ కు సీమ పాల్ కి పెళ్ళి జరిగి చాలా కాలం అవుతుంది.  ఈ దంపతుల మధ్య చాలా కాలంగా గొడవలు జరుగుతున్నాయి.


ఒక రోజు సడెన్ గా సీమ పాల్ తన ప్రియుడు అయిన ఉమేష్ పాల్ తో  లేచిపొయింది. వారిద్దరు కలిసి ఛారపని అనే గ్రామాంలో ఒక ఇళ్ళు అద్దెకు తీసుకోని సహజీవనం చేస్తున్నారు. కోన్ని రోజుల తర్వాత వారిద్దరు గోరఖ్ పూర్ గ్రామనికి వచ్చారు. ముగ్గురు కలిసి తమ విషయంలొ న్యాయం జరిపించాలని ఆ ఊరి పెద్దల దగ్గరికి వెళ్ళారు. అప్పుడు ఆ గ్రామా పెద్దలు ఉమేష్ పాల్ ను తనకున్న మొత్తం గొర్రెల్లో సగం రాజేష్ పాల్ కి ఇవ్వలని నిర్ణయించింది.

ఈ ఒప్పందం మీ ముగ్గురికీ నచ్చితే రాజేష్ పాల్ భార్య ను ఉమేష్ పాల్  పెళ్ళి చేసుకోవచ్చని చెప్పింది.ఈ వింత ఒప్పందనికి అ ముగ్గురు ఒప్పకున్నారు. ఉమేష్ పాల్ కు మొత్తం 142 గోర్రెలు ఉన్నాయి. అందులో నుండి 71 గొర్రెలను రాజేష్ పాల్ కు ఇచ్చాడు. రాజేష్  గొర్రెలను తీసుకుని వెళ్ళాడు . సీమ పాల్ ఉమేష్ పాల్ తో కలిసి వెళ్ళింది.అక్కడి తో కథ సుఖాంతం అయింది అనుకున్నారు.


ఇక్కడ చిన్న ట్విస్ట్ జరిగింది ఉమేష్ పాల్ తండ్రికి ఈ ఒప్పందం ఇష్టం లేదు. ఉమేష్ తండ్రి రాజేష్ పై దొంగతనం కేసు నమొదు చేశాడు.తన గోర్రెలను తన ఇప్పించమని పోలీసులను ప్రధేయపడ్డాడు. విచరణ చేసిన పొలీసులకీ రాజేష్ పాల్  దోంగతనం చేయలేదని ఉమేష్ పాల్ ఇచ్చడాని తెలిసింది. చేసేది ఏమిలేక పొలీసు వెనక్కి వచ్చారు.



మరింత సమాచారం తెలుసుకోండి: