తెలంగాణ ముఖ్య‌మంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మ‌రోమారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ మండిప‌డ్డారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాను ఆహ్వానించిన తర్వాత ఆయన సభకు హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగించారు.కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం కల్వకుంట్ల కుటుంబం పాలవుతోందని  అన్నారు.  టీఆర్ఎస్ .. తండ్రీ, కొడుకుల పార్టీ అనీ.. కాంగ్రెస్ .. తల్లీ కొడుకుల పార్టీ అని… బీజేపీ మాత్రమే భరతమాత ముద్దు బిడ్డల పార్టీ అని చెప్పారు. “రాష్ట్రంలో సర్కారు బడులు మూత బడుతున్నాయి. సెక్రటరియేట్ రాని ముఖ్యమంత్రికి కొత్త సెక్రటరియేట్ కడుతున్నారు. దేశభక్తి గురించి చెబుతున్న కేటీఆర్ … ముందు మీ పార్టీ విధానం ఏంటో చెప్పాలి” అని డిమాండ్ చేశారు.


అవినీతి, అప్పుల్లో తెలంగాణ నంబర్ వన్ గా ఉందని ల‌క్ష్మ‌ణ్ అన్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారనీ.. కమీషన్ల కోసమే ప్రాజెక్టుల రీ- డిజైనింగ్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ చేశారని అన్నారు. రాష్ట్రంలో కాంట్రాక్టర్లు, హాస్పిటళ్లు.. ఇలా.. పలు విభాగాల్లో బిల్లుల చెల్లింపులు ఆగిపోయి.. పనులు, సేవలు నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడిందని లక్ష్మణ్ అన్నారు. ఉద్యోగ నియామకాలు లేవనీ.. ప్రతీ విషయంలోనూ కోర్టులో ప్రభుత్వానికి చుక్కెదురే అవుతోందని అన్నారు. ఇంటర్ ఆత్మహత్యలపై రాష్ట్రపతి.. గవర్నర్ ను నివేదిక కోరితే… కేసీఆర్ అదంతా కుట్ర అంటున్నారని విమర్శించారు. 
అమిత్ షాను అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్‌గా అభివర్ణించిన లక్ష్మణ్ కేంద్రం నిధుల‌ను సైతం స‌రైన రీతిలో ఉప‌యోగించ‌డం లేద‌ని అన్నారు. మోడీ నాయకత్వాన్ని విశ్వసించి వివిధ పార్టీల నేతలు బీజేపీలోకి వస్తున్నారని తెలిపారు. త్వరలో దేశం 5 ట్రిలియన్​ డాలర్​ ఎకానమీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జల్​ జీవన్ ద్వారా దేశంలోని ప్రతి ఇంటికీ మంచినీళ్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఆవాస్​ యోజన కింద పేదలందరికీ ఇండ్లు కట్టిస్తున్నామని తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: