అఖండ భార‌తే మా ల‌క్ష్యం.. ఇదీ బీజేపీ, దాని అనుబంధ సంస్థ ఆర్ఎస్ఎస్‌.. ఇత‌ర సంస్థ‌లు చాలా ఏళ్లుగా చెబుతున్న‌మాట‌. రెండోసారి కేంద్రంలో భారీ మెజార్టీతో అధికారంలోకి వ‌చ్చిన 70రోజుల్లోనే ప్ర‌ధాని మోడీ.. ఆ దిశ‌గా కీల‌క ఘ‌ట్టం పూర్తి చేశారు. క‌శ్మీర్‌కు ప్ర‌త్యేక ప్ర‌తిప‌త్తి క‌ల్పించే ఆర్టిక‌ల్ 370ని ర‌ద్దుచేసి.. ఒక‌టే దేశం.. ఒక‌టే జెండా.. అంటూ దేశ‌ప్ర‌జ‌ల మ‌న‌సు గెలుచుక‌న్నారు. అయితే.. ఇక్క‌డ ప‌లువురు ఆర్టిక‌ల్ 370 ర‌ద్దును వ్య‌తిరేకిస్తున్నారు. కానీ.. మెజార్టీ మ‌ద్దతు మాత్రం మోడీకే ఉన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే.


ఇక ఇదే స‌మ‌యంలో రెండుమూడు రోజులుగా ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్ ఒక‌టి చ‌క్క‌ర్లు కొడుతోంది. అదేమిటంటే.. భూటాన్‌ను కూడా భార‌త్‌లో ఒక‌రాష్ట్రంగా క‌లిపేస్తార‌ని..! భూటాన్ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాని మోడీ ఉన్న స‌మ‌యంలో ఈ పోస్ట్ వైర‌ల్‌గా మారింది. నిజంగానే.. మోడీ భూటాన్ మూడ్‌లో ఉన్నారా..? అని అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంటోంది. బ్రిటీష్ నుంచి స్వాతంత్య్రం పొందిన త‌ర్వాత అనేక సంస్థానాలు భార‌త్‌లో విలీనం అయ్యాయి. కొన్నిసంస్థానాలు త‌మంట‌తాము భార‌త్‌లో క‌ల‌వ‌గా.. మ‌రికొన్నింటినేమో.. న‌యానో భ‌యానో భార‌త్ క‌లిపేసుకుంది. 


ఇక క‌శ్మీర్‌లాంటి ప్ర‌త్యేక సంస్థానం.. భార‌త్‌లో ఉంటూనే.. ప్ర‌త్యేక రాజ్యాంగం.. అంటూ ఆర్టిక‌ల్ 370తో న‌డిచింది మొన్న‌టి వ‌ర‌కు.. గ‌తంలో ప‌లు ప్ర‌త్యేక‌ ప్రాంతాలు భార‌త్‌లో రాష్ట్రాలుగా క‌లిసిపోయాయి. ప్ర‌త్యేక దేశంగా ఉన్న సిక్కింను 1975లో భార‌త్ క‌లిపేసుకుంది. పోర్చుగీసు ఆధీనంలో ఉన్న‌గోవాను 1974లో భార‌త్ క‌లిపేసుకుంది. ఫ్రాన్స్ ఆధీనంలో ఉన్న పుదుచ్చేరిని 1954లో భార‌త్ క‌లిపేసుకుంది. 1962లో అధికారికంగా భార‌త్‌ప్ర‌క‌టించింది. ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు నేప‌థ్యంలో ఇప్పుడు ఈ ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ ముందుకు వ‌చ్చింది. 


నిజానికి.. భ‌ద్ర‌త‌, స‌రిహ‌ద్దు దృష్ట్యా భూటాన్ అత్యంత ప్రాధాన్య‌త‌గ‌ల ప్రాంతం. ఇది అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌, సిక్కింల మ‌ధ్య ఉంటోంది. ఇప్ప‌టికే అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్‌పై ప‌ట్టుకోసం చైనా అనేక ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉంది. అంత‌ర్జాతీయంగా అత్యంత కీల‌క‌మైన భూటాన్‌ను కూడా మోడీ భార‌త్‌లో క‌లిపేస్తారా..? అనే చ‌ర్చ మొద‌లైంది. అయితే.. ఇక్క‌డ త‌మదైన జీవ‌న శైలితో ప్ర‌పంచ‌లో త‌మ‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు పొందిన భూటాన్ ప్ర‌జ‌లు అందుకు అంగీక‌రించ‌డం అంత సులువేం కాదుమ‌రి. మోడీ ముందుముందు ఏంచేస్తారో చూడాలి మ‌రి.


మరింత సమాచారం తెలుసుకోండి: