అవును ఏపి రాజకీయాల్లో ఎల్లోమీడియా ఇపుడు రివర్సు గేరులో నడుస్తోంది. అంటే ఎల్లోమీడియా సాంతం చంద్రబాబునాయుడు స్టాండ్ మీద నడుస్తుంటుంది. చంద్రబాబుకు ఎవరైతే శతృవులుగా ఉంటారో వారందరూ ఎల్లోమీడియాకు కూడా శతృవులే. అదే చంద్రబాబుకు ఎవరైతే మిత్రులుగా ఉంటారో వాళ్ళనే ఎల్లోమీడియా నెత్తికెక్కించుకుంటుంది. ఈ విషయం గతంలో చాలా సార్లే రుజువైంది.

 

తాజాగా మరో మారు ఎల్లోమీడియా వ్యవహారం చర్చకు వచ్చిందంతే. వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా ఇదే విషయాన్ని ట్విట్టర్లో ఎత్తి చూపించారు. చంద్రబాబు ఎన్డీఏలో ఉన్నంత కాలం ఏపి అభివృద్ధి విషయంలో కేంద్రప్రభుత్వం భేష్. నరేంద్రమోడి బ్రహ్మాండమని ఎల్లోమీడియా కూడా కితాబిలిచ్చిన విషయం అందరికీ తెలిసిందే.

 

ఎప్పుడైతే ఎన్డీఏలో నుండి చంద్రబాబు బయటకు వచ్చేశారో  వెంటనే ఏపి అభివృద్ధికి కేంద్రప్రభుత్వం, నరేంద్రమోడి ప్రధమ శతృవులైపోయారు. ఎన్నికల్లో చంద్రబాబుకు తల బొప్పి కట్టేంత వరకూ ఎల్లోమీడియా ఇదే విధంగా కథనాలు వండి వార్చింది. ఏపిలో చంద్రబాబుకు జనాలు గూబగుయ్యిమనిపించారు. కేంద్రంలో మోడి మరింత మంచి మెజారిటితో అధికారంలోకి వచ్చారు. దాంతో కొద్ది రోజులు ఎల్లోమీడియా కూడా కామ్ అయిపోయింది.

 

మళ్ళీ ఎప్పుడైతే చంద్రబాబు బిజెపికి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారో వెంటనే కేంద్రప్రభుత్వం బ్రహ్మాండం..మోడి అద్భుతం అని ఎల్లోమీడియా భజన మొదలుపెట్టింది. అందుకనే నలుగురు టిడిపి రాజ్యసభ ఎంపిలు బిజెపిలోకి ఫిరాయించినా, టిడిపి నేతలు బిజెపిలో చేరుతున్నా పెద్దగా వ్యతిరేక వార్తలు రాయటం లేదు.

 

చూడబోతే ఎల్లోమీడియానే మోడి-చంద్రబాబును మళ్ళీ ఏకం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు అనుమానంగా ఉంది. సరే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎలాగూ చంద్రబాబు జేబులో మనిషే కాబట్టి ఇబ్బందులు లేవు. బహుశా తొందరలో జరగబోయే స్ధానిక సంస్ధల ఎన్నికల్లోపే బిజెపి-చంద్రబాబు-పవన్ కలిసినా ఆశ్చర్యం లేదన్నట్లుగా ఉంది వ్యవహారాలు. అందుకనే ముగ్గురు కలిసి జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గా ఒకే విధమైన స్టేట్ మెంట్లు ఇస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: