ఇలాగే ఉంది ప్రస్తుతం చంద్రబాబునాయుడు పరిస్ధితి. ఏపిలో ఘోర పరాజయం మూటగట్టుకున్న తర్వాత భవిష్యత్ కార్యచరణను మళ్ళీ తెలంగాణా నుండి మొదలుపెడదామని అనుకున్నారు చంద్రబాబు. అందుకనే వారంలో రెండు రోజులు అంటే శని, ఆదివారాలు హైదరాబాద్ లోని తెలంగాణా నేతలకు అందుబాటులో ఉంటానని గొప్పగా చెప్పుకున్నారు. కానీ మారి పరిస్ధితులు చూస్తుంటే తెలంగాణాలో టిడిపి తుడిచిపెట్టుకుపోయింది.

 

వాస్తవాలు మాట్లాడుకోవాలంటే చంద్రబాబు సమావేశం పెట్టటానికి తెలంగాణాలో నేతలే కనిపించటం లేదు. ఒక్క తెలంగాణా అధ్యక్షుడు ఎల్ రమణ తప్ప మరో నేతే కనబడటం లేదు. శని, ఆదివారాల్లో  తెలంగాణా నేతలతో సమావేశం అవటానికి చంద్రబాబు సిద్దంగానే ఉన్నా నేతలే కరువయ్యారట.

 

రాష్ట్ర విభజన తర్వాత టిడిపిలోని గట్టి నేతలను కెసియార్ లాక్కున్నారు. మిగిలిన కొంతమంది నేతలు కాంగ్రెస్ లో చేరిపోయారు. ఇంకా ఎక్కడైనా మిగిలున్నారు అనుకునే అడుగుబొడుగు నేతలను బిజెపి లాగేసుకుంటోంది. ఆదివారం భారీ సంఖ్యలో టిడిపి నేతలు బిజెపిలో చేరిన విషయం అందరూ చూసిందే.

 

అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న దేవేందర్ గౌడ్ లాంటి నేతలు కూడా చివరకు బిజెపిలో చేరటానికి రెడీ అయిపోయారంటే ఏమనుకోవాలి. రాజ్యసభ సభ్యత్వం ముగిసేవరకూ టిడిపిలోనే ఉన్న గౌడ్ ఇపుడు బిజెపి కండువా కప్పు కోవటానికి రెడీ అయిపోయారు. మొత్తానికి పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఏదో మొహమాటానికి ఎల్ రమణ మాత్రం ఇంకా కంటిన్యు అవుతున్నట్లున్నారు.

 

తెలంగాణా పార్టీ అధ్యక్షుడు కూడా ఏ బిజెపిలోకో లేకపోతే టిఆర్ఎస్ లోకో వెళిపోతే చంద్రబాబు ఎవరితో భేటీ అవుతారు ? ఒక విధంగా తెలంగాణాలో ఉన్న ధీన పరిస్దితి ఏపిలో లేకపోయినా అక్కడ కూడా మెల్లిగా నేతలు బిజెపిలోకి  వెళ్ళిపోతున్నారు. చంద్రబాబు నాయకత్వం మీద నమ్మకం లేకే ఏపి నేతలు కూడా బిజెపిలో చేరుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గేట్లు ఎత్తలేదు కాబట్టి సరిపోయింది. అదే గేట్లు కానీ ఎత్తుంటే ఈ పాటికే తెలంగాణా పరిస్ధితే ఏపిలో కూడా ఎదురయ్యేదేమో ?

 


మరింత సమాచారం తెలుసుకోండి: