ఇటీవల కాలంలో చాలా సంవత్సరాల నుంచి ఉన్న సమస్యకు పరిష్కారం చూపించిన మోదీ సర్కార్ పై పొగడ్తల వర్షం కురిసిన సంగతి మనందరికి తెలిసిన సంగతే. దీనిని విమర్శిస్తూ కూడా మరికొందరు ఆందోళనలు చేశారు.ఇంత వేడి వాతవరణంలో ఆగస్ట్ 15 వేడుకలు ఎలా జరుగుతాయా అని భయపడిన సందర్బాలు కూడా ఉన్నాయి.కానీ పరిస్తితులను తిప్పికొడుతూ శాంతియుతంగానే ఆ వేడుకలు జరిగాయి.కానీ ఇప్పుడు జమ్మూ మరియు కాశ్మీర్ నివురుగప్పిన నిప్పులా మారింది. ఏ క్షణాన ఏం జరుగుతుందో అర్థం కాని ఆందోళన మొదలైంది.


ఆర్టిల్ 370ని రద్దు చేసి కాశ్మీర్, లఢాక్ ని విభజించిన తరువాత కొంత ప్రశాంతత కనిపించినా, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. జమ్ము లో మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయి. దీంతో భద్రతా బలగాలు మళ్లీ ఆంక్షలను అమల్లోకి తీసుకువచ్చాయి. కొన్ని చోట్ల ఇప్పటికే అప్రకటిత కర్ఫ్యూ కొనసాగుతోంది. మరి కొన్ని చోట్ల వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తున్నారు. దీంతో కాశ్మీర్ లో పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారుతుంది. ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని కాశ్మీర్ లోని రాజకీయ పార్టీలన్నీ వ్యతిరేకించాయి. ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీతో పాటు జమ్మూ కాశ్మీర్ కు చెందిన ఎంపీలను కూడా గృహనిర్బందంలో పెట్టారు. ఆందోళనకారులు ఆర్టికల్ 370ను వ్యతిరేకిస్తూ ర్యాలీలు తీశారు. ఇటు రద్దును సమర్ధిస్తూ కొన్ని సంఘీభావ ర్యాలీలు, సభలు కూడా జరిగాయి.ఆగస్ట్ 15 వరకు పరిస్థితి శాంతంగానే కనిపించింది. కానీ ఇప్పుడు ఊహించని విధంగా కాశ్మీర్ లో మళ్లీ ఉద్రిక్తత మొదలైంది. ఏ క్షణాన ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది. ఆదివారం జమ్మూ మరియు కాశ్మీర్ లో ఆందోళనలు పెరిగాయి. చాలా చోట్ల ర్యాలీలు, నిరసనలు కనిపించాయి.


ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ పలుచోట్ల ఘర్షణలు తలెత్తాయి. ఈ నేపధ్యంలో భద్రతా బలగాలు కొన్ని చోట్ల లాఠీచార్జి కూడా చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో కశ్మీర్ లో కర్ఫ్యూ వాతావరణం ఏర్పడింది. దీంతో ఇవాళ ఉదయం నుంచి మళ్లీ కాశ్మీరులో భద్రతా బలగాలను మోహరిస్తుంది కేంద్రం. ఆర్టికల్ 370 ని రద్దు చేసిన నాటి పరిస్థితి మళ్లీ స్పష్టంగా కనిపిస్తుంది. సాంబా, కథువా, ఉదంపూర్ ,రియాసీలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. కాగా కాశ్మీర్ లో నేటి నుంచి స్కూళ్లు కాలేజీలు తెరుచుకోనున్నాయి.రానున్న కాలంలో ఏం జరుగనుంది అనేది వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: