వరుణుడు కొంచం శాంతి చెందినట్టు ఉన్నడు.ఆంధ్రప్రదేశ్ లో వరద తగ్గు ముఖం పట్టింది. కేవలం నలభై ఎనిమిది గంటల వ్యవధిలో దాదాపుగా మూడు లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహం తగ్గింది. ఈ సాయంత్రానికి ఇది మరింతగా తగ్గే అవకాశముందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాదాపుగా వరద ముప్పు తప్పినట్టేనని అధికార వర్గాలు తెలిపాయి. అయితే లంక గ్రామాలను చుట్టుముట్టిన వరద నీరు సముద్రంలోకి చేరడానికి మరో మూడు, నాలుగు రోజుల సమయం పట్టవచ్చని అధికారులు చెబుతున్నారు. ఎగువ రాష్ట్రాల నుంచి వరద నీరు తగ్గు ముఖం పట్టడంతో ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, తుంగభద్ర, శ్రీశైలం నుంచి వరద ప్రవాహం గత నాలుగు రోజులతో పోలిస్తే సగానికి సగం తగ్గింది.


శ్రీశైలం జలాశయానికి వరద తగ్గు ముఖం పట్టింది. దీంతో ఇరిగేషన్ ఇంజనీర్ లు క్రెస్టుగేట్ల లెవల్ ను తగ్గిస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయానికే ఎనిమిది వందల ఎనభై ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా అడుగుల వద్ద నూట తొంభై ఎనిమిది పాయింట్ మూడు ఆరు రెండు మూడు టీఎంసీల నిల్వలు నమోదయ్యాయి. జూరాల నుంచి మూడు లక్షల అరవై వేల ఆరు వందల అరవై ఆరు క్యూసెక్కులు, తుంగభద్ర నుంచి అరవై ఎనిమిది వేల మూడు వందల తొంభై క్యూసెక్ ల వరద వస్తుంది. కుడి, ఎడమ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తున్నారు. 


వెనుకజలాలు నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ముప్పై నాలుగు వేల క్యూసెక్కులు, హంద్రీ నీవాకు రెండు వేల ఇరవై ఆరు క్యూసెక్ లు, కల్వకుర్తికి రెండు వేల నాలుగు వందల క్యూసెక్ ల నీటిని విడుదల చేస్తున్నారు. కాగా ఆదివారం రాత్రి పదకొండు గంటలకు ఇన్ ఫ్లో మూడు లక్షల డెబ్బై మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్కులు ఉంటే, ఔట్ ఫ్లో నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల ఇరవై ఏడు క్యూసెక్కులు నమోదైంది. ఆదివారం రాత్రి నాగార్జున సాగర్ నుంచి రెండు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల క్యూసెక్కులు మాత్రమే పులి చింతలకు విడుదల చేశారు.


ఇప్పటికే పులి చింతలకు విడుదలైన నీరు కారణంగా అక్కడ నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల క్యూసెక్ కుల వరద నీరు వచ్చి చేరుతుంది. దిగువకు కూడా అంతే మొత్తంలో నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఐదు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల క్యూసెక్ కుల వరద ప్రవాహం కొనసాగుతుండగా, దిగువకు ఆరు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల క్యూసెక్కులు విడిచిపెడుతున్నారు. దీనితో ప్రస్తుతం పరిస్తితులు త్వరలో కుదుటపడుతున్నాయని అధికారులు వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: