కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణా కలల ప్రాజెక్ట్.. దీన్ని ప్రభుత్వం అనుకున్న సమయానికి పూర్తి చేసింది.  రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని ప్రాజెక్టుకు నీటిని తీసుకొచ్చింది. ఇటీవలే ఈ ప్రాజెక్టు ను ఓపెన్ చేశారు.  ఈ ప్రాజెక్ట్ ఓపెనింగ్ కు ఏపీ సీఎం జగన్ తో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ కూడా హాజరయ్యారు.  అంగరంగవైభవంగా ప్రాజెక్ట్ ఓపెనింగ్ జరిగింది.  



గత కొన్ని రోజులుగా వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో.. ఈకాళేశ్వరం ప్రాజెక్ట్ కు వరద నీరు వచ్చి చేరింది. జలాశయం నిండిపోయింది.  అయితే, ఈ ప్రాజెక్ట్ విషయంలో అవినీతి జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి.  ఈ ప్రాజెక్టుకు మొదట ప్రతిపాదించిన బడ్జెట్ 28వేల కోట్ల రూపాయలు కాగా, ప్రాజెక్టుకు దాదాపు 80 వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అయినట్టు తెలుస్తోంది.  



ప్రాజెక్ట్ వ్యయం భారీగా పెరడగడంతో కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాజెక్ట్ లెక్కలపై విరుచుకుపడుతున్నది.  రివర్స్ పంపింగ్ పేరుతో ఎన్నో వేల కోట్ల రూపాయల వ్యయాన్ని పెంచారని కాంగ్రెస్ సీనియర్ నేత బట్టి విక్రమార్క ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో మొదలుపెట్టిన బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ ని తమ్మిడి హట్టి నుంచి నిర్మించే ఉంటే ఇన్ని ప్రయాసలు ఉండేవి కావని అన్నారు. అలా నిర్మించి ఉంటే గ్రావిటీ ద్వారా నీరు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లో కి వచ్చేదని.. అలా చేయడం వలన ఇప్పుడు ఈ స్థాయిలో వ్యయం అయ్యేది కాదని ఆరోపించారు.  వేల కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని ఆయన పేర్కొన్నారు.  



బంగారు తెలంగాణపేరుతో తెరాస పార్టీ ఎన్నో అవినీతి కార్యక్రమాలు చేపట్టిందని, తెరాస అవినీతిపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని, అవినీతిపై విచారణ జరిపించాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తామని భట్టి విక్రమార్క చెప్తున్నాడు.  అయితే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా కేంద్రంలోను కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉన్నది.  అప్పట్లో ఈ ప్రాజెక్టులను ఎందుకు ప్రారంభించి ముగించలేదు అన్నది అందరి ముందున్న ప్రశ్న.  ప్రతి పక్షంలో ఉండగానే విమర్శలు చేయడం షరా మాములే.  కాళేశ్వరం వెనుక నిజంగా అవినీతి జరిగి ఉంటె.. ఆ విషయాలు తప్పకుండా బయటకు వస్తాయి.  చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది.  చట్టం ఎవరి చుట్టం కాదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: