కమళ దళం పార్టీ అంటేనే చాలు ఇప్పుడు అందరు పొగడ్తలతో ముంచేత్తుతున్నారు. రోజు రోజుకు బలం కూడా పుంజుకుంటోంది ఈ పార్టీ.ఈ పార్టీ కీలక నిర్ణయాలే దీనికి కారణం. ఆదివారం నాడు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్ పై కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లు తీసుకునే వాళ్లు రిజర్వేషన్ లు అనుభవించినవాళ్లు మధ్య సహృద్భావ వాతావరణం లో చర్చ జరగాలంటూ కొన్ని కీలకమైన వ్యాఖ్య లు చేశారు.

ఈ వ్యాఖ్యల అర్థమేంటి నిజంగా రిజర్వేషన్ లను ఎత్తివేసే ఆలోచనలో బిజెపి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఉందా అని ఆలోచనల కూడా ఆ చర్చలో జరుగుతున్నాయి. పరిస్థితులను గమనిస్తుంటే నిజానికి  గత కొంత కాలంగా రిజర్వేషన్ లు ఎత్తివేయాలంటూ కూడా చాలా మంది నుంచి ఆ చర్చ జరుగుతున్న పరిస్థితులు. నిజంగా రిజర్వేషన్ లను తీసివేయడం సాధ్యమేనా ?

కావున రిజర్వేషన్ ల వల్ల కొంతమందికి నష్టం జరుగుతుందని ఓపెన్ క్యాటగిరి లో ఉన్నవాళ్లకి నష్టం జరుగుతుందని ఆ చర్చ ఎప్పట్నుంచో జరుగుతుంది. ఈనేపధ్యంలో క్రీమిలేయర్ కూడా తీసుకువచ్చారు అయినాసరే క్రీమిలేయర్ వల్ల కూడా అది సరిగ్గా అమలు కాని నేపథ్యంలో దాని వల్ల కూడా నష్టం జరుగుతుంది అని చెప్పి ఎక్కువ శాతం ప్రజలు  అంటున్న సంగతి మనకు తెలుసు. ఇప్పుడు సాధారణంగా రిజర్వేషన్ లాంటి అంశాల పై ఒక నిర్ణయం తీసుకునే అంశం ఏ పార్టీ కూడా చేయదు. కానీ బీజేపీ మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది.

సంచలనాత్మకమైన నిర్ణయాలూ ఈ దేశంలో ఇవి అమలు  చేయడం సాధ్యమేనా అని అనుకునే అంశాల పై కూడా బీజేపీ ఒక కీలక నిర్ణయాలు తీసుకుంటున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఆర్టికల్ 370 రద్దు వంటి  సుదీర్ఘ కాలంగా జరుగుతున్న చర్చ ఇది ఎప్పటికైనా జరగాల్సిందే అయినా కూడా ఏ పార్టీ కూడా మెజారిటీ ఉన్న సందర్భాల్లో కూడా అతిపెద్ద పార్టీలు కూడా నిర్ణయాల్ని తీసుకోలేకపోయాయి. కాని దీని పై ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది బీజేపీ ప్రభుత్వం. ఇంకొక కీలకమైన అంశం గత ఐదేళ్ల పాలనలో బీజేపీ తీసుకున్న కీలకమైన అంశం, పది శాతం ఈబీసీలకు ఎకనామికల్లీ బ్యాక్ వర్డ్ సెక్షన్స్ అంటే మొత్తం అన్ని క్యాటగిరీస్ లో, మొత్తం అన్ని కులాలు అన్ని మతాల్లో కూడా ఆర్ధికంగా వెనకబడి ఉన్న వారికి పది శాతం రిజర్వేషన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించడం జరిగింది. ఇది చాలా సాహసం సాహసమైన నిర్ణయంతో అగ్రవర్ణాలకే న్యాయం జరిగే నిర్ణయం.

సాధారణంగా అగ్రవర్ణాల  పది శాతం రిజర్వేషన్ ఇవ్వడం ఇది చిన్న విషయం కాదు దాని కోసం కూడా అంతకు ముందు చాలా కాలంగా చర్చ జరుగుతున్న కూడా ఏ పార్టీ కూడా అగ్రవర్ణాల్లో పేదలకు మేలు చేసే ప్రయత్నం చేయలేకపోయింది. కానీ ఆ నిర్ణయాన్ని తీసుకోవడం అది వెనువెంటనే అమలు చేయడం కూడా జరిగిపోవడం నిజంగా గోప్పతనం అనే చెప్పుకోవాలి. మరొక్కసారి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఈ అంశంపై మాట్లాడిన నేపధ్యంలో రిజర్వేషన్ ల అంశంలో కూడా బీజేపీ కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతోంది అనే చర్చ కూడా ప్రారంభమైంది. మరోవైపు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా  చాలా కాలంగా మన దేశంలో వాయిదాలో ఉన్న అంశం ఇది. దీని పై కూడా బీజేపీ నిర్ణయం తీసుకునే అవకాశా లు ఉన్నాయి.

కొంత రిజర్వేషన్ లను ఎత్తివేసే ప్రయత్నం చేసి ఒకవేళ నిర్ణయం తీసుకుంటే దాని వల్ల కొంత కేంద్ర ప్రభుత్వానికి బీజేపీకి  కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం కనిపిస్తోంది. దాని నుంచి జరిగే నష్టాన్ని చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.  ఇప్పుడు ఒకవేళ రిజర్వేషన్ పై చర్చ జరగాలి అంటే అది బీజేపీ అంతర్గత ఎజెండా అవుతుంది. బీజేపీ  రిజర్వేషన్ లు ఎత్తివేస్తే కనుక ఇది రాజ్యాంగ స్ఫూర్తి కి విరుద్ధం అని ఇది బిజెపి హిడెన్ అజెండా అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు.

కానీ నిజానికి 'అంబేద్కర్ కూడా పూర్తికాలం అంటే ఎక్కువ కాలం రిజర్వేషన్ ఉండాలని కోరుకోలేదు కేవలం బడుగు బలహీన వర్గంగా ఉన్న ప్రజలు ఒక స్థాయి వచ్చే వరకే  అమలు చేయాలని ఆయన కూడా పూర్త కాలం ఉండాలని కోరుకోలేదని'  చెప్పే ప్రయత్నం ఒక వర్గం బీజేపీ అధికారులు చేస్తున్నారు. బీజేపీ ఎన్నో సాహసమైన నిర్ణయాలు తీసుకుని అన్నింటినీ టకటకా అమలు చేస్తున్న నేపధ్యంలో రిజర్వేషన్ లపై  సుదీర్ఘ కాలంగా నడుస్తున్న ఈ చర్చకు మోహన్ భగవత్ చెప్పినట్టుగా  బీజేపీ సహృద్భావ వాతావరణంలో చర్చ జరిగే అవకాశం ఉందా అని అంశాలు వినిపిస్తున్నాయి.

ఈ అంశంపై కూడా బీజేపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయాన్ని తీసుకురాగలిగితే  తిరుగులేని ధైర్యమైన పార్టీగా ముందుకు సాగిపోతుంది. ఇక బీజేపీ ప్రభుత్వం త్వరలో ఏం చేయబోతుందనేది మాత్రం వేచి చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: