రాజకీయాలు రంగు మారాయి

 ప్రస్తుత తరంలో రాజకీయాల  లో విలువలు దారుణంగా పడిపోతున్నాయని  మాజీ ప్రధాని శ్రీ హెచ్.డి.దేవెగౌడ అన్నారు.   కర్ణాటకలో రాజకీయ పరిస్థితులు కుర్చీ ల కుమ్ములాట లకు మారుపేరుగా మారిపోయాయని,  కనీవినీ ఎరుగనంత స్థాయికి రాజకీయాల్లో నైతిక విలువలు పడిపోయినట్లు శ్రీ దేవి గౌడ చెప్పారు.

 వర్షాలు వరదలతో   ఒకపక్క రాష్ట్రం అతలాకుతలమౌతున్న  శ్రీ ఎడ్యూరప్ప ప్రభుత్వం ఏ విధంగానూ పట్టించుకోవడంలేదని  అనవసర విషయాలపై దృష్టి పెట్టి ప్రజలను, ప్రజా సంక్షేమాన్ని  పూర్తిగా మర్చిపోయి ప్రవర్తిస్తుందని శ్రీ దేవి గౌడ తెలిపారు .  వరద బాధితులను ఆదుకోని సహాయక చర్యలు పూజ్యమయ్యాయని ఫోన్ టాపింగ్ అనే అంశం మాత్రం  ముఖ్యమైనదిగా భావించిన ఎడ్యూరప్ప ప్రభుత్వం ప్రజా సమస్యలను మరిచిపోయి, నైతిక విలువలను తుంగలో తొక్కి  అనవసర రాజకీయాలకు పాల్పడుతున్నారని శ్రీ హెచ్.డి.దేవెగౌడ ఆవేదన వ్యక్తం చేశారు.

 ప్రస్తుత పరిస్థితుల్లో ఫోన్ టాపింగ్ అంశాన్ని పక్కన పెట్టి వరద బాధితులను ఆదుకునే చర్యలు ప్రారంభించాలని దీనికొరకు మనమంతా నడుం కట్టాలని  ఆయన హితవు పలికారు. రాష్ట్రాన్ని పట్టి పీడించే ముఖ్యమైన సమస్యలు గాలికి వదిలేసి అనవసర ఈ విషయాలపై దృష్టి పెట్టి సమయం వృధా చేసుకోవడం భావ్యం కాదని,  ప్రజల ఆశలు ఆశయాలు నెరవేర్చ వలసిన ప్రభుత్వాలు ఈ విధంగా చేయకూడద ని సూచించారు.

మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనకే పాపం  తెలవదు అని ప్రభుత్వం ఎటువంటి విచారణ జరిపిన  కూడా తాను సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని, తన తప్పు ఉన్నట్లు తేలితే ఏ విధమైన నా శిక్ష విధించినా భరించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: