విశాఖ ఎక్స్ ప్రెస్ ఇంజిన్ డ్రైవర్ నిర్లక్ష్యం ప్రయాణికులకు శాపంగా మారింది. నర్సీపట్నం దగ్గర బోగీల ను వదిలి ఇరవై కిలోమీటర్ల దాకా ఇంజన్ ముందుకు వెల్లినా కూడా డ్రైవర్ చూసుకోకుండా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అధికారుల సమాచారం మేర తిరిగి వచ్చాడు.


ప్రతీ  రోజూ విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ కు విశాఖ ఎక్స్ప్రెస్ నడుస్తూ‌ ఉంటుంది రోజూ నాలుగున్నర సమయంలో విశాఖ నుండి బయలుదేరి సికింద్రాబాద్ కు  వెళుతుంది. ఈ‌రోజు  నక్కపల్లి దగ్గర నర్సీపట్నం సమీపం లో ఆర్టీసీ క్రాస్ రోడ్ స్టేషన్ ఉంటుంది. దానిని దాటి కొంత దూరం వెళ్లిన తర్వాత అక్కడ ఒకసారి ఆగిపోయింది,  ఇంజన్ కి భోగీ కి ఉండే లింక్ రాడ్, హీట్ ప్రెజర్ పైపులు  విరిగి‌ పోవడం  వల్ల ఇంజన్  నుండి భోగీ  వేరు పడింది. ఇవన్ని ముందే సరిగా లేవని దెబ్బ తిని ఉన్నాయని సమాచారం, వీటిని అధికారులు సరిగా గమనించకుండా ఉండడం వల్ల ఈ ఘటన జరిగి ఉండవచ్చు.   


నర్సీపట్నం దాటిన తరువాత నక్కపల్లి దగ్గర అవి వేరు పడి ఇంజన్ భోగీ రెండూ విడి పోయాయి, ఈ సంగతి గమనించని రైల్వే డ్రైవర్ ఇంజన్ తీసుకుని అక్కడి నుండి దాదాపు ఒక 15 నుండి 20 కిలో‌మీటర్లు వెళ్ళిన తరువాత అధికారులు  సమాచారం ఇవ్వడం తో తిరిగి వచ్చాడు.



భోగీ లో‌ ఉన్న ప్రయాణీకులు  ఎవరైన చైన్ లాగి ఉంటారనుకుని చాలా సేపు అలానే వేచి ఉన్నారు. కాసెపటి తరువాత కొంత మంది బయటికి దిగే సరికి వారికి ఇంజన్ కనిపించక పోయేసరికి వారు ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే కొంతమంది రైల్వే అధికారులకి సమాచారం ఇచ్చారు. అధికారులు వెంటనే రైల్ డ్రైవర్ కి రేడియో ద్వారా సమాచారం ఇచ్చారు. ఇంజన్ వెనక్కి వచ్చేసరికి రైల్వే అధికారులు కూడా అక్కడికి వచ్చి విరిగిన వాటిని పరిశిలించి వాటిని మరమ్మత్తు చేసి తిరిగి ఆ భోగీ ని తీసుకుల్లినట్టు అందులో‌ ఉన్న ప్రయాణీకులు తెలిపారు.డ్రైవెర్ నిర్లక్షానికి పూర్తిగా భోగీ ని వదిలి వెళ్ళడానిని అక్కడ ఉన్న వారందరూ తప్పు పడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: