ప్రైవేటు బస్సుల దోపిడీ సహించం -  తెలంగాణ రవాణా శాఖ

 తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు బస్సుల ద్వారా జరుగుతున్న అక్రమాలను ఇక ఎంత మాత్రం సహించబోమని రవాణా శాఖ అధికారులు అంటున్నారు.   పండగలు మరియు ఇతర పర్వదినాలను, వేసవి సెలవుల సమయంలోనూ ఈ ప్రైవేటు బస్సు ఆపరేటర్లు దోచుకుంటున్నారని ఈ దోపిడీకి కళ్లెం వేసే దిశగా తమ రవాణా శాఖ అడుగులు వేస్తోందని డిప్యూటీ రవాణా కమిషనర్ శ్రీ పాపారావు అన్నారు.

 తెలంగాణ రాష్ట్రం నుంచి  పొరుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్,  కర్ణాటక మహా రాష్ట్ర తమిళనాడు మొదలగు ప్రదేశాల కు ప్రైవేట్ బస్సులు చాలా తిరుగుతుంటాయ ని వాటిలో సరియైన పెర్మిట్ లేక  కొన్ని బస్సులు, సరి అయిన నా దృవ పత్రాలు లేక మరి కొన్ని బస్సులు తిరుగుతున్నాయని ఇక అటువంటి బస్సులకు కళ్లెం వేయాల్సిన పరిస్థితి వచ్చిందని  తమ శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టినట్లు తప్పనిసరిగా నిర్లక్ష్యపు ప్రైవేట్ ఆపరేటర్లకు ముక్కు తాడు వేసి తగిన శిక్ష విధిస్తామని శ్రీ పాపారావు తెలిపారు. గత ఆదివారం రాత్రి నుంచి జరిపిన ఆకస్మిక తనిఖీలు తెలంగాణ రవాణా శాఖకు భారీ ఆదాయం వచ్చిందని, నిబంధనలకు విరుద్ధంగా రోడ్డెక్కిన ఎన్నో  బస్సులను పట్టుకున్నామని శ్రీ పాపారావు తెలియజేశారు. ఈ తనిఖీలు శ్రీ పాపారావు గారు కూడా స్వయంగా పాల్గొని ప్రైవేటు బస్సుల అక్రమాలను వెలికితీశారు.

ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని తమ శాఖ తీసుకునే ఈ ఆకస్మిక తనిఖీలు  అనే చర్య వల్ల ప్రయాణికులందరూ లాభ పడతారని ఆయన తెలియజేశారు




మరింత సమాచారం తెలుసుకోండి: