యుఎస్ వాణిజ్య కార్యదర్శి విల్బర్ రాస్ ఆగస్టు 19 న హువావే టెక్నాలజీస్ కు  ఇచ్చిన ఉపశమనాన్ని అమెరికా ప్రభుత్వం పొడిగిస్తుందని, ఇది చైనా కంపెనీకి యుఎస్ కంపెనీల నుండి సామాగ్రిని కొనుగోలు చేయడానికి అనుమతించిందని, తద్వారా ఇప్పటికే ఉన్న వినియోగదారులకు సేవలను అందించగలదని, ఇప్పటికే దాని  50 శాతం యూనిట్లను  యుఎస్  బ్లాక్ లిస్ట్ లో వేసింది అమెరికా ప్రభుత్వం. 


ఆగష్టు 19 తో ముగియనున్న “తాత్కాలిక  లైసెన్స్” హువావేకి ఇంకొక 90 రోజులు పొడిగించబడుతుంది, ఆగస్టు 19 న ఫాక్స్ బిజినెస్ నెట్‌వర్క్‌తో మాట్లాడుతూ, శుక్రవారం రాయిటర్స్ రాసిన  విషయాన్ని ధృవీకరించింది. అంతే కాకుండా 46 హువావే అనుబంధ సంస్థలను కూడా ఎంటిటీ జాబితాలో చేర్చుతున్నానని, మొత్తం  100 కంటే ఎక్కువ హువావే ఎంటిటీలకు పెంచుతున్నానని చెప్పారు. యు.ఎస్. కస్టమర్లకు సహాయం చేయడానికి మాత్రమే ఈ పొడిగింపు ఇచ్చినట్టు రాస్ తెలిపారు. వీటిలో చాలా వరకు  గ్రామీణ అమెరికాలో నెట్‌వర్క్‌లు ఉన్నాయి అని తెలిపారు. 

 "తమంతట తాము వెళ్ళిపోవడానికి మేము వారికి మరికొంత సమయం ఇస్తున్నాము" అని మిస్టర్ రాస్ చెప్పారు. మేలో కంపెనీని బ్లాక్ లిస్ట్ చేసిన కొద్దికాలానికే, వాణిజ్య విభాగం మొదట్లో హువావే తన వినియోగదారులకు అంతరాయాన్ని కలిగించ కుండా ఉండే లక్ష్యంతో కొన్ని అమెరికన్ తయారీ వస్తువులను కొనుగోలు చేయడానికి అనుమతించింది. ఆగష్టు 19 న దానికి ఇచ్చిన గడువు ముగిసింది ఇప్పుడు దానికి  నవంబర్ 19 వరకు పొడిగింపు ఇచ్చింది అమెరికా ప్రభుత్వం.

 ప్రస్తుత టెలికమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లను నిర్వహించడానికి, హువావే హ్యాండ్‌సెట్‌లకు సాఫ్ట్‌వేర్ అప్డేట్లు అందించేందుకు  ఈ ఒప్పందం పునరుద్ధరిస్తుంది. నవంబర్లో యుఎస్ కంపెనీలకు ఏమి జరుగుతుందో అని అడిగినప్పుడు, "ప్రతిఒక్కరూ దీని గురించి చాలా నోటీసు ఇచ్చారు, అమెరికా అధ్యక్షుడితో చాలా చర్చలు జరిగాయి." అని రాస్ సమాధానమిచ్చారు.  హువావేను ఈ సంవత్సరం ప్రారంభంలో యుఎస్ వస్తువులను కొనకుండా నిరోధించినప్పుడు, ఇది చైనా-యుఎస్  ట్రేడ్ యుద్ధంలో ఒక పెద్ద తీవ్రతగా భావించబడింది. జాతీయ భద్రతా  ప్రయోజనాలకు విరుద్ధమైన చర్యలలో ఈ చైనా కంపెనీ పాల్గొందని ఆరోపిస్తూ యు.ఎస్ ప్రభుత్వం హువావేని బ్లాక్ లిస్ట్ చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: