ఇప్పుడు సినిమా బావుంటే చాలు.. స్టార్ ఎవరన్నది చూడటం లేదు. బడ్జెట్ ఎక్కువ కాకుండా పెద్దగా స్టార్ లేకపోయినా సినిమా ఆడాలంటే.. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ప్రకారం.. హారర్, థ్రిల్లర్ సినిమాలే కరెక్టు.. తాజాగా వచ్చిన రాక్షసుడు, ఎవరు ఈ ట్రెండ్ ను రుజువు చేశాయి. ఇప్పుడు అదే బాటలో మరో వినూత్న కథనం సినిమాగా వస్తోంది.


అదే ‘హవా’.. సినిమా.. 9గంటలు, 9బ్రెయిన్స్, 9 నేరాలు అనేదే ఆ క్యాప్షన్. అంటే సినిమా కేవలం 9 గంటల కాలంలో నడుస్తుందన్నమాట. మరి ఆ తొమ్మిదిమంది ఎవరు.. ఏం నేరాలు చేశారు.. అదీ తొమ్మిదిగంటల్లోనే.. తద్వారా వాళ్ల లైఫ్ లో జరిగిన మార్పులేంటీ అనేది థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లేతో సాగే కథ. ఈ సినిమా అంతా పూర్తిగా ఆస్ట్రేలియాలోనే చిత్రీకరణ జరుపుకుంది. పూర్తిగా ఆస్ట్రేలియాలోనే చిత్రీకరించిన తొలి తెలుగు తెలుగు సినిమా ఇదే.


ఈ నెల 23న విడుదల కాబోతోంది హవా. లేటెస్ట్ గా ఈ సినిమా థీమ్ సాంగ్ ను డైనమిక్ లేడీ మంచు లక్ష్మి చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ.. ‘మేకింగ్ చాలా బావుంది. విజువల్ గ్రాండీయర్ లా కనిపిస్తోంది. ఈ థీమ్ సాంగ్ నాకు బాగా నచ్చింది. పిక్చరైజేషన్ కూడా చాలా ఇంట్రెస్ట్ గా అనిపించింది. అందరూ కొత్తవాళ్లైనా వెరీ ఇంప్రెసివ్ వర్క్ చేశారు.


ఇలాంటి కథలు ఇప్పుడు బాగా ఆడుతున్నాయి. హవా కూడా అలాంటి ఇన్నోవేటివ్ స్టోరీలా కనిపిస్తోంది. థీమ్ సాంగ్ చూస్తుంటేనే వీళ్ల కష్టం అర్థం అవుతోంది. ఖచ్చితంగా హవా ఆడియన్స్ కు నచ్చుతుంది. ఈ సినిమా కమర్షియల్ గా కూడా హవా చేయాలని కోరుకుంటున్నాను’ అన్నారు. మరి ఈ హవా ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: