వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యి సరిగ్గా మూడు నెలలు కూడా కాలేదు.. అప్పుడే ప్రత్యర్థులు వ్యతిరేక ప్రచారం షురూ చేశారు. ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం ఇప్పటికే ఈ విషయంలో జోరు మీద ఉంది.. మాజీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ రోజుకు మూడు సార్లు ట్వీట్ల ద్వారా జగన్ సర్కారును ఏకేస్తున్నారు.


అయితే వారు ఎంత విమర్శించినా అది ప్రతిపక్షం వాయిస్ గానే ఉంటుంది. ప్రతిపక్షం అలా కాక ఇంకెలా మాట్లాడుతుందని జనం అనుకునే ఛాన్స్ ఉంది. అందుకే .. మీడియా ముసుగులో దుష్ప్రచారం కూడా అప్పుడే జోరందుకుంది. టీడీపీ తన అనుకూల మీడియా ద్వారా జగన్ సర్కారుపై జోరుగా దుష్ప్రచారం సాగిస్తోంది.


ఇందులో ప్రధానమైంది.. జగన్ తీరుతో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది.. జగన్ కారణంగా పెట్టుబడులు వెనక్కు వెళ్తున్నాయి. జగన్ వైఖరితో పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు..ఇదీ ఇలా సాగుతోందా దుష్ప్రచారం. తాజాగా.. ఏసియన్‌ పల్ప్‌ & పేపర్‌ సంస్థ ఏపీని వీడుతున్నట్లు టీడీపీ అనుకూల పత్రికలో వార్త వచ్చింది. దీంతో ఏపీ సర్కారు మండిపడింది. ఈ వార్తకు పరిశ్రమల శాఖ నుంచి ఖండన వచ్చింది.


ఏపిలో పరిశ్రమలకు సంబందించి కొన్ని ప్రసార సాదనాలు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయని ఏపి ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. పెట్టుబడిదారులు రాష్ట్రం నుంచి వెళ్లిపోతున్నట్లుగా కావాలని వార్తలను సృష్టిస్తున్నారని మండిపడింది. అలా దురుద్దేశాలతో వార్తలు ఇచ్చేవారిపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి ఒక ప్రకటనలో హెచ్చరించారు.


విషపూరితమైన ఇలాంటి ప్రయత్నాలను గమనిస్తున్నామని, రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, అవినీతిరహితంగా, పారదర్శక విధానంతో ముందుకెళుతుందని పరిశ్రమల శాఖ ప్రకటించింది. ఏపీలో పెట్టుబడులు పెట్టేలా వివిధ సంస్థలను ప్రోత్సహిస్తోందని పరిశ్రమల శాఖ తెలిపింది. ఏసియన్‌ పల్ప్‌ & పేపర్‌ సంస్థ యాజమాన్యంతో ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతోందని ప్రిన్సిపల్ కార్యదర్శి తన ప్రకటనలో వివరించారు. మరి తప్పుడు కథనం ఇచ్చినట్టు భావిస్తే..ఎలాంటి చర్యలు తీసుకుంటారో మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: