దోనకొండ...ఈ పేరు ఎక్కడో విన్నట్లుంది కదా. అవును నిజమే. దోనకొండ అన్నది ఎవరికీ పెద్దగా తెలియని రోజుల్లో శివరామక్రిష్ణ  కమిటీ ఆ ప్రాంతాన్ని వెలుగులోకి తెచ్చింది. ప్రాచుర్యంలో
పెట్టింది. గుంటూరు, ప్రకాశం జిల్లా సరిహద్దుల్లో ఉన్న దోనకొండ ఇటు కోస్తాకు, అటు రాయలసీమకు అనువైన ప్రాంతంగా శివరామక్రిష్ణ కమిటీ తేల్చేసింది. ఇక్కడ ప్రభుత్వ భూములు, అటవీ భూములు  చాలా ఎక్కువగా ఉన్నాయి.


పెద్దగా ఖర్చు అవకుండా తక్కువలో రాజధాని నిర్మించుకోవచ్చు అని కూడా శివరామక్రిష్ణ కమిషన్ సూచించింది. అయితే నాటి చంద్రబాబు సర్కార్ పెడచెవిన పెట్టి పంట భూములు కలిగిన అమరావతి ప్రాంతంలో వేలాది భూములు సేకరించి అక్కడ రాజధాని అన్నారు. దాని వల్ల అధిక వ్యయంతో పాటు, మూడు పంటలు పండే భూములు కూడా రైతులు కోల్పోయారు. ఇక రైతులకు ఉపాధి పోయింది. వారికి పెద్ద ఎత్తున పరిహారం ఇవ్వాలి. అంతే కాదు, భూకంపాల జోన్ అది, వరదలు వస్తే బహుళ అంతస్తుల భవనాలు కూడా మునుగుతాయి.


అక్కడ నేల సింకింగ్ సాయిల్. అందువల్ల బాగా లోతున పునాదులు వేసి కట్టాలి. ఎన్ని చేసినా ప్రమాదం మాత్రం కచ్చితంగా పొంచి ఉంది. తాజాగా వచ్చిన క్రిష్ణా వరదలు చూసిన వారు ఎవరైనా అమరావతి రాజధానిగా సేఫ్ కాదని అనుభవ పూర్వకంగా చెబుతారు. జగన్ సర్కార్ కూడా ఇటువంటి అవకాశం కోసం చూస్తోంది. ఇపుడు ప్రక్రుతి ఒక వార్నింగ్ ఇచ్చింది. దాన్ని కాషన్ గా తీసుకుని జగన్ సర్కార్ దోమకొండ వద్ద  కొత్త రాజధాని ప్రకటించేందుకు సిధ్ధం కాబోతోంది. దోమకొండ రాజధాని అయితే కేంద్రం సాయం కూడా ఇస్తుంది. పెద్దగా ఖర్చు లేకుండా కట్టుకోవచ్చు.


అంతే కాదు, అటవీ భూములు వందల ఎకరాల్లో ఉన్నాయి.  వాటిని డీ నోటిఫై చేయడం ద్వారా పైసా ఖర్చు లేకుండా భూములు కూడా తీసుకోవచ్చు. జగన్ సర్కార్ ఈ పని చేస్తే ఏపీ మీద రాజధాని భారం పూర్తిగా తగ్గిపోతుంది. ఇప్పటికే రెండున్నర లక్షల కోట్ల అప్పులతో ఉన్న ఏపీ కొత్త అప్పులను భారాన్ని తట్టుకోలేదు. లక్షల కోట్లు పెట్టుబడి పెట్టి అమరావతి రాజధాని నిర్మించడం  చంద్రబాబుకు కూడా  అసాధ్యమే.  భారీ ఎత్తున అప్పులు తెచ్చి క‌ట్టినా కూడా అది సేఫ్ జోన్ కాదు, ఇక అప్పులు కూడా రాబోయే పది తరాల మీద దారుణంగా పడతాయి. ఈ సమయంలో జగన్ సర్కార్ సాహసంతో రాజధాని మార్చడానికి నిర్ణయం తీసుకోవడమే ఉత్తమం అని రాష్ట్ర అభివ్రుధ్ధి కోరుకుంటున్న వారంతా అనే మాట. 


మరింత సమాచారం తెలుసుకోండి: