కొడంగల్...ఈ పేరు చెబితే చాలు. అందరికీ రేవంత్ రెడ్డి గుర్తొస్తాడు. అంతలా ఆయన కొడంగల్ పై పట్టు సాధించుకున్నాడు. 2009 ఎన్నికల్లో తనకు ఏ మాత్రం తెలియని కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ టీడీపీ తరుపున పోటీ చేసి గెలిచారు. అపోజిషన్ లో ఉన్న ఆయన నియోజకవర్గంలోనే ఉంటూ కొడంగల్ ప్రజలకు దగ్గరయ్యాడు. ఆ అభిమానంతోనే 2014లో మరోసారి రేవంత్ రెడ్డిని కొడంగల్ ప్రజలు టీడీపీ తరుపున గెలిచిపించారు. అయితే అప్పుడు రాష్ట్రం విడిపోవడంతో టీఆర్ఎస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది.


దీంతో మరోసారి రేవంత్ ప్రతిపక్షానికే పరిమితయ్యాడు. అయినా ప్రజలతోనే ఉన్నాడు. కానీ కొంతకాలానికి ఓటుకు నోటు కేసు రావడం, తర్వాత రేవంత్, టీడీపీ పరిస్తితి ఏమైందో అందరికీ తెలుసు. మెయిన్ లీడర్స్ అందరూ పార్టీని వీడారు. ఇక రేవంత్ కూడా పార్టీకి భవిష్యత్ లేదని చెప్పి, కాంగ్రెస్ లో చేరిపోయారు. అప్పటికే రేవంత్ టార్గెట్ చేసుకుని రాజకీయాలు చేసిన టీఆర్ఎస్ కొడంగల్ మీద ఫోకస్ పెట్టింది. 


ఈ క్రమంలోనే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు ఊహించని విధంగా రేవంత్ కొడంగల్ లో ఓడిపోయారు. అయితే రేవంత్ ఓడిపోయినా, గెలిచినా కొడంగల్ ని మాత్రం వీడనని, ప్రజలతోనే ఉంటానని ప్రకటనలు చేశారు. అయితే రేవంత్ లోక్ సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి పోటీ చేయడం గెలుపొందడం జరిగిపోయింది. అప్పటి నుంచి ఆయన గ్రేటర్ పరిధిలోనే పాగా వేసుకుని ఉన్నారు. అక్కడే తిరుగుతూ ఉన్నారు. కొడంగల్ మీద పెద్ద ఆసక్తి కనబరుస్తున్నట్లు కనిపించలేదు. 


దీంతో రేవంత్ కొడంగల్ కు దూరమైపోయారనే ప్రచారం జరుగుతుంది. కార్యకర్తలు కూడా ఏమన్నా పని ఉంటే హైదరాబాద్ కి వెళ్ళి రేవంత్ ని కలుస్తున్నారు తప్ప, రేవంత్ కొడంగల్ కి రావడం తగ్గించేశారు. పైగా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిలో ఉన్న రేవంత్ పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేసే పనులు కూడా పెద్దగా చేస్తున్నట్లు అనిపించడం లేదు. మొత్తం మీద రేవంత్ కొడంగల్ కి దూరంగా హైదరాబాద్ కి దగ్గరగా జరిగినట్లు కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: