ఐ ఎన్ ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం అరెస్ట్ కు రంగం సిధ్ధమైంది. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం నిన్న ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరగా ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఐ ఎన్ ఎక్స్ మీడియాలోకి విదేశీ పెట్టుబడుల విషయంలో చిదంబరం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడనే కేసును ఈడీ, సీబీఐలు నమోదు చేసాయి. ఎయిర్ సెల్ - మాక్సిస్ వ్యవహారంలోను చిదంబరంపై కేసులు నమోదు అయ్యాయి. 
 
మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్ట్ కాకూడదని ముందస్తు బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేయగా ఆ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు జడ్జ్ కొట్టివేసారు. ఐ ఎన్ ఎక్స్ మీడియాకు 307 కోట్ల రుపాయలు రావటంలో చిదంబరం సహకరించాడని ఆరోపణలతో కేసు నమోదైంది. 
 
చిదంబరానికి ముందస్తు బెయిల్ విషయంలో ఢిల్లీ హైకోర్టు నిరాకరించటంతో చిదంబరం నివాసానికి సీబీఐ, ఈడీ అధికారులు వెళ్ళారు.ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవటంతో అధికారులు చిదంబరం ఇంటికి నోటీసులు అంటించారు. చిదంబరం ఫోన్ కూడా స్విచ్చాఫ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. రెండు గంటల సమయంలో విచారణకు హాజరు కావాలని సీబీఐ అధికారులు నోటీసులో పేర్కొన్నారు. 
 
2017 సంవత్సరం నుండి ఈ కేసు కొనసాగుతుంది. గతంలో ముందస్తు బెయిల్ కోరిన చిదంబరంకు అప్పట్లో బెయిల్ లభించింది. ప్రజా ప్రతినిధి అయినంత మాత్రాన ముందస్తు బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ కేసులో చిదంబరం పాత్ర ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం చేసింది ఢిల్లీ హైకోర్టు.చిదంబరంను కస్టడీలోకి తీసుకొని విచారించాలని ఢిల్లీ హై కోర్టు వ్యాఖ్యానించింది. హైకోర్ట్ నిర్ణయాన్ని చిదంబరం సుప్రీం కోర్టులో సవాలు చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. ప్రముఖ న్యాయవాది కపిల్ సిబాల్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తుంది. సుప్రీం కోర్టు ఈ విషయంలో చిదంబరంకు ఏమైనా ఊరటనిస్తుందేమో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: