ఏ బ్యాంకు ఎప్పుడు తన నిర్ణయాలను మార్చుకుంటుందో చెప్పలేని పరిస్దితి.ఏ ఆఫర్ ఎప్పుడుపెడుతుందో,ఎప్పుడు తీసేస్తుందో అర్దం కాని అయోమయం.అసలే నోట్ల రద్ధు జరిగినప్పటినుండి అష్టకష్టాలు పడిన జనం ఇప్పుడిప్పుడే కాస్త కోలు కుంటున్నారు. మొన్నామధ్య మినిమం బ్యాలన్స్ అని,కార్ద్‌లిమిట్సని కస్టమర్లని ఆందోళనకు గురిచేసారు.ఇప్పుడేమో డెబిట్ కార్డులకు చెల్లు చీటీ పాడాలని భావిస్తున్నారు,అధికారం మనదైతే అడిగేవారుండరనే చందాగా సాగుతుంది.సామాన్య జనం ఐతే ,కోట్లు కొల్లగొట్టిన వారిని వదిలి సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోతున్నారు.ఇప్పుడేమో డెబిట్ కార్డంటూ కొత్త మంట పెడుతు న్నారు..ఎవరు ఏమనుకున్న ఏది ఏమైన మార్పు మాత్రం ఆగదు.




ఈ మంట పెట్టేది ఎవరో కాదు దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,తన ఖాతాదారులకు భారీ ఝలక్ ఇచ్చేందుకు సిద్ధమౌతోంది.డెబిట్ కార్డులకు చెల్లుచీటీ పాడాలని భావిస్తోంది. అంటే బ్యాంక్ కస్టమర్లకు ఇక డెబిట్ కార్డులు ఉండక పోవచ్చు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు బ్యాంక్ ఇలాంటి నిర్ణయం త్వరలో తీసుకోబోతోందట.ఎస్‌బీఐ చైర్మన్ రజ్‌నీష్ కుమార్ మాట్లాడుతూ డెబిట్ కార్డులను తొలగించాలని భావిస్తున్నాం.ఎందుకంటే దేశంలో ఏకంగా 90కోట్ల డెబిట్ కార్డులు,3కోట్ల క్రెడిట్ కార్డులు ఉన్నాయని డెబిట్ కార్డులు లేని వ్యవస్థ కోసం యోనో యాప్ వంటి సేవలు ప్రవేశపెడుతున్నామని తెలిపారు.
ఈ యోనో యాప్ ద్వారా డెబిట్ కార్డు లేకుండానే ఏటీఎం మెషీన్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకునే అవకాశం వుందని,అలాగే వ్యాపారుల వద్ద కూడా డెబిట్ కార్డు లేకుండానే లావాదేవీలు నిర్వహించొచ్చని పేర్కొన్నారు.




వచ్చే ఐదేళ్లలో ప్లాస్టిక్ డెబిట్ కార్డుల వినియోగం దాదాపు తగ్గిపోతుందని వర్చ్యువల్ కూపన్లే భవిష్యత్ అని,క్యూఆర్ కోడ్ విధా నంలో కూడా లావాదేవీలు నిర్వహించొచ్చని,దీనికయ్యే ఖర్చు కూడా తక్కువేనని ధీమాగా చెప్పారు.రాబోయే రోజుల్లో జరిగే ఈ మార్పు విషయం పై ఇప్పటినుంచే మా బ్యాంక్ ప్రణాళికబద్దంగా ముందుకు సాగుతు కస్టమర్లకు ఇబ్బంది కలుగకుండా ఇప్పటికే 68,000 యోనో క్యాష్‌పాయింట్లను ఏర్పాటు చేసిందని కుమార్ తెలిపారు. ఈ సంఖ్యను 10 లక్షల వరకు తీసుకెళ్లే పక్రియను వచ్చే 18 నెలల్లో  పూర్తి చేస్తామని తెలిపారు.అలాగే యోనో యాప్,క్రెడిట్ కార్డు మాదిరి కూడా పనిచేస్తుందని పేర్కొన్నారు... 

మరింత సమాచారం తెలుసుకోండి: