ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసిన అన్నీ చోట్ల డిపాజిట్లు కోల్పోయి... ఒక్కశాతం కూడా ఓట్లు తెచ్చుకోలేదన్న విషయం తెలిసిందే. దీంతో బీజేపీ ఏపీలో బలపడేందుకు దృష్టి పెట్టింది. అందులో భాగంగానే చాలామంది టీడీపీ నేతలనీ పార్టీలోకి తీసుకుంది. అలాగే ఇతర పార్టీల నేతలకు కూడా కాషాయ జెండా కప్పింది. ఈ క్రమంలోనే జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం  విషయంలో బీజేపీ అందితే కాళ్ళు, అందకపోతే జుట్టు అనే మాదిరిగా ప్రవర్తిస్తుంది.


ఒకవైపు జగన్ కు స్నేహహస్తం అందిస్తూనే...మరోవైపు వీక్ చేసే ప్రయత్నాలు చేస్తోంది. జగన్ తొలిసారి సీఎం అవ్వగానే ప్రధాని మోడీ  ‘కేంద్రం మద్ధతు ఫుల్ గా ఉంటుందని ప్రకటించి జగన్ కు శుభాకాంక్షలు కూడా చెప్పారు. కానీ ఆ తర్వాత విద్యుత్ పీపీఏల విషయంలో జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. అలా అని జగన్ ఢిల్లీకి వస్తే అన్నీ చేసి పెడతామని మంచిగా చెబుతున్నారు. 


అటు పోలవరం జగన్ రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీన్ని కూడా కేంద్రం వ్యతిరేకించింది. ఇలా వ్యతిరేకించిన వెంటనే కేంద్ర ప్రభుత్వం జగన్ ని అంతర్ రాష్ట్రాల మండలి స్థాయి సంఘం సభ్యునిగా నియమించింది. ఈ క్రమంలోనే బీజేపీ ఉత్తరాదిలాగా హిందూ కార్డుని ఏపీలో ప్రయోగించాలని చూస్తోంది. జగన్ మోహన్ రెడ్డి క్రిస్టియన్  అని అందుకని తాజాగా అమెరికా పర్యటనలో ఉన్న ఆయన ఓ కార్యక్రమంలో ఆరంభ సూచికగా వెలిగించాల్సిన దీపాన్ని వెలిగించకపోవడాన్ని తప్పుబడుతోంది. 


రాష్ట్ర పార్టీ నేతలంతా ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి విమర్శలు చేస్తున్నారు. అయితే గత చంద్రబాబు ప్రభుత్వానికి చుక్కలు చూపించిన బీజేపీ జగన్ ని వెనుకేసుకొచ్చింది. అలాగే తాజాగా కొన్ని సందర్భాల్లో జగన్ కు మద్ధతు ఇచ్చారు. అప్పుడు గుర్తు రాని మతం బీజేపీకి ఇప్పుడు గుర్తొచ్చింది. ఈ విధంగా బీజేపీ జగన్ కు ఒకవైపు మద్ధతు ఇస్తూనే...మరోవైపు దెబ్బ కొట్టాలని చూస్తోంది. మొత్తానికి అందితే కాళ్ళు..అందకపోతే జుట్టు అన్న చందంగా బీజేపీ ప్రవర్తన ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: