క్షేత్రస్ధాయిలో వాస్తవం చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఎన్నికల సమయంలో కానీ పాదయాత్ర సమయంలో కానీ జగన్ ఇచ్చిన అనేక కీలక హామీల్లో ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయటం కూడా ఒకటని అందరికీ తెలిసిందే. ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ చాలా సంవత్సరాలుగా వినిపిస్తోంది. యూనియన్ నేతలు, కార్మికులు డిమాండ్ చేయటమే కానీ ప్రభుత్వాలు మాత్రం ఆ దిశగా స్పందించలేదు.

 

అలాంటిది మొన్నటి ఎన్నికల ముందు జగన్ మాత్రం ఆర్టీసిని విలీనం చేస్తామనే హామీని కార్మిక నేతలకు ఇచ్చారు. దాంతో ఆర్టీసిలో పనిచేసే వేలాది సిబ్బందిలో మెజారిటి ఓట్లు వైసిపికే పడ్డాయనటంలో సందేహం లేదు. అధికారంలోకి రాగానే విలీనం విషయమై జగన్ నిపుణులతో కమిటి కూడా వేశారు. దాంతో విలీనం ప్రక్రియ తొందరలోనే జరిగిపోతుందని అందరూ అనుకుంటున్నారు.

 

ఇలాంటి నేపధ్యంలోనే ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేసే అవకాశాలకు న్యాయపరమైన సమస్యలున్నట్లు తెలిసింది. చాలామందికి తెలిసిన విషయం ఏమిటంటే ఆర్టీసీ పూర్తిగా రాష్ట్రప్రభుత్వానికి చెందిన కార్పొరేషన్ అనే. కానీ తెలీని విషయం కూడా ఒకటుంది. అదేమిటంటే ఆర్టీసి కార్పొరేషన్లో కేంద్రప్రభత్వ వాటా కూడా ఉందని.

 

సింగరేణి కాలరీస్ లో ఉన్నట్లే ఆర్టీసిలో కూడా కేంద్రప్రభుత్వ వాటా ఉంది. కాబట్టి రాష్ట్రప్రభుత్వం తన ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకునేందుకు లేదు. ఆర్టీసిలో కేంద్రం వాట 31 శాతం ఉంది. ముందుగా 31 శాతం వాటాకు సమానంగా నిధులను కేంద్రానికి  చెల్లిస్తే అప్పుడేమైనా కేంద్రం వాటా వదులుకోవటానికి ఒప్పుకుంటుందేమో తెలీదు.

 

ఓ భారీ కార్పొరేషన్లో 31 శాతం వాట అంటే వేల కోట్ల రూపాయల్లోనే ఉంటుంది. అంత మొత్తాన్ని కేంద్రానికి చెల్లించే పరిస్ధితుల్లో రాష్ట్రప్రభుత్వం లేదు. కాబట్టి ఏకంగా ఆర్టీసి విలీనాన్ని పక్కనపెట్టి ఉద్యోగులను మాత్రం ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. చూద్దాం జగన్ అమెరికా నుండి వచ్చిన తర్వాత ఏం అంటారో ?

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: