కాంగ్రెస్ సీనియర్ నేత అయిన చిదంబరం పైన సీబీఐ వేసిన ఆరోపనలను ఖండిస్తూ కాంగ్రెస్ కు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ప్రియంక గాంధి తన ట్విట్టర్ అకౌంట్ లో స్పందించారు. దేశానికి మాజీ కేంద్ర మంత్రిగా తన సేవలను అందించిన వ్యక్తిని ఇలా ఆరోపించడం సరి కాదు అని ఆమె అభిప్రాయపడ్డారు.


పీ చిదంబరం దేశం లోనే అత్యంత గౌరవనీయులైన రాజ్యసభ సభ్యులుగా పని చేసారు. ఆర్థిక మంత్రిగా, హోం మంత్రిగా సేవలను అందించారు. ఆయన నిర్మొహమాటంగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడే వ్యక్తి. ఈనాటి ప్రభుత్వం చేస్తోన్న తప్పిదాలను సూటిగా అడుగుతుంటారు,"అని ట్వీట్ చేశారు.
నిజాలు మాట్లాడుతోన్న వాల్ల మీద కొందరు పిరికి వారు చేస్తోన్న పనులు ఇవి. సీబీఐ ఆయన మీద వేస్తోన్న ఆరోపణలు అవమానపూరితంగా ఉన్నాయి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే మేము అంతా వారికి అండగా నిలుస్తాము," అని పేర్కొన్నారు ప్రియంక. 


ఐఎన్ఎక్స్ మీడియా కి సంబంధించిన కేసులో ముందస్తుగానే పి. చిదంబరం బెయిల్ కి పిటిషన్ పెట్టుకున్న విషయం మనకు తెలిసినదె. ఇది డిల్లీ హై కోర్టులో కొట్టివేశారు. ఆ తరువాత వెనువెంటనే సుప్రీం కోర్టులో దాఖలు చేYఅడం, మరియూ అది తాజాగా సుప్రీం కోర్టులో లో కూడా కొట్టివేయడం వలన ప్రియంక గాంధి పై విధంగా ఆమె మధతుని తెలియజేసారు. బుధవారం నాడు మల్లీ పిటిషను వేయాలని కోర్టు సూచించిన మేరకు చిదంబరం కోసం సీబీఐ మరియూ ఈడీ బృందాలు గాలింపులు మొదలుపెట్టాయి.


చిదంబరం తనయుడు పి.కార్తీ కి తాము సహాయం చేసాము అని, అందుకు చిదంబరం తమతో ఎన్నో ఒప్పందాలు చేసుకునారు అని తాజాగా ఇంద్రానీ మరిన్ని ఆధారాలతో నిరూపించడం వలన కేసు రోజు రోజుకి బలపడుతూ వస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: