తెలంగాణలోని పలు ప్రభుత్వ ఆస్పత్రుల నిర్లక్ష్యం వీడడం లేదు . ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి చుట్టు పక్కల జిల్లాల నుంచి భారీగా నిత్యం రోగులు వస్తుంటారు . పేరుకే పెద్దాస్పత్రి అయినా ఆస్పత్రిల్లో సిబ్బందిపై డాక్టర్ లకు డాక్టర్లపై అధికారులకు నియంత్రణ లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి . ఈ వైకరి కారణంగా ఏమి తెలియని ఒక బాలుడు దీనికి బాధితుడు కావాల్సి వచ్చింది . వివరాలలోకి వెళితే దానవాయిగూడెంకి చెందిన వెంకటేష్ కుమారుడు విషిత్ హిమోఫిలియాతో బాధపడుతున్నాడు . కాలుకు వాపు రావడంతో ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు .


మామూలుగా హిమోఫిలియాతో బాధపడేవారు చిన్న దెబ్బ తగిలినా తట్టుకోలేరు . హీమోఫిలియా రోగులకు ప్రతి ఆరు నెలలకు ఓసారి ఇంజెక్షన్ ఇస్తారు . ఇందులో భాగంగా ఖమ్మం ఆస్పత్రి వైద్యులు విషిత్ కూ ఇంజెక్షన్ చేశారు. అది కాలం చెల్లిన ఎక్స్ పైరీ అయిన ఇంజెక్షన్ అని తెలుసుకుని వెంకటేశ్ అవాక్కయ్యాడు . ఇంజెక్షన్ విషయాన్ని వైద్యుల దృష్టికి తీసుకువెళ్లాడు . ఎక్స్ పైర్ అయిన ఇంజక్షన్ చేసినా ఏమీ కాదని డేట్ ఉన్న మరోక ఇంజెక్షన్ చేసి విషిత్ ను ఇంటికి పంపించారు . కాలం చెల్లిన ఇంజక్షన్ తో తమ కుమారుడికి ఏమైనా జరిగి ఉంటే ఎవరు బాధ్యులని వెంకటేష్ ప్రశ్నిస్తున్నారు .


ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం పై చర్యలు తీసుకోవాలని విషిత్ బంధువులు కోరుతున్నారు . పేదరికంతో డబ్బులు లేక ప్రభుత్వ హాస్పటల్స్ కి వెళ్తే , ప్రభుత్వ హాస్పటల్ సిబ్బంది ఇలా నిర్లక్ష్యం చేస్తే మేము ఎక్కడకి వెళ్ళాలి అని కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు వాపోతున్నారు . ఈ విషయం పై ఉన్నతాధికారులు దృష్టి వహించి తగిన కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: