బంగారం ధర ఆకాశాన్ని అంటింది అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు . రోజురోజుకి కొత్త గరిష్టా స్థాయిలను తాకుతోంది. పది గ్రాముల పుత్తడి నలభై వేలకు చేరుకుంది. గత కొద్ది రోజులుగా జీవిత కాల గరిష్ఠ స్థాయిలను తిరిగేస్తున్న పుత్తడి ధర తాజాగా మరో రికార్డు స్థాయిని నమోదు చేసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల మేలిమి బంగారం ధర ముప్పై ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై కి చేరుకుంది.


ప్రాంతీయ నగల వ్యాపారుల నుంచి డిమాండ్ క్రమంగా పెరగడంతో ఒక్క రోజులోనే రెండు వందలు పెరిగి ఆల్ టైమ్ రికార్డ్ ఎక్కువ స్థాయికి చేరింది. అంతర్జాతీయ మార్కెట్ లో డిమాండ్ తగ్గినప్పటికీ దేశీయంగా వ్యాపారులు ఆభరణ తయారీ దారుల నుంచి డిమాండ్ అధికంగా ఉండటంతో పసిడి మరింత పుంజుకుంది. రూపాయి బలహీన పడుతుండడం కూడా బంగారం ధర పెరగడానికి కారణమవుతుంది. దేశీయ స్టాక్ మార్కెట్ లు పతనం అవుతున్నందున ఇన్వెస్టర్ లు సురక్షిత పెట్టుబడి మార్గమైన బంగారం వైపునకు మళ్లడమే డిమాండ్ పెరగటానికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. అంతర్జాతీయంగా బంగారం ధర స్థిరంగా ఉంది.


ఔన్సు పదిహేను వందల డాలర్ల వరకు పలుకుతుంది. న్యూయార్క్ కమోడిటీ మార్కెట్ లో ఔన్స్ బంగారం ఒక వెయ్యి నాలుగు వందల తొంభై ఆరు డాలర్ల వద్ద ట్రేడవగా, వెండి పదహారు పాయింట్ తొమ్మిది మూడు డాలర్ లు పలికింది. డాలర్ బలపడటంతో పాటు ట్రేడర్ లు విలువైన లోహాల పెట్టుబడులపై లాభాల స్వీకరణకు పాల్పడడంతో అంతర్జాతీయంగా ధరలు స్వల్పంగా తగ్గాయి. ఈ వారం చివరలో యుఎస్ ఫెడరల్ రిజర్వు జూలై సమావేశ మినిట్స్ జాక్సన్ హోలీ ప్రసంగ ఉన్న నేపథ్యంలో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు. అంతర్జాతీయంగా బంగారం ధరతో పోలిస్తే డాలర్ బలంగా ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు ఉన్న దేశీయంగా బంగారం ధర పెరుగుతుండటం విశేషం. గత శనివారం పది గ్రాముల బంగారం ముప్పై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బైకు చేరి ఆల్ టైం రికార్డు ధరను నమోదు చేయగా మంగళవారం నాడు ఆ రికార్డు బద్దలైంది.



మరింత సమాచారం తెలుసుకోండి: