గత కొంత కాలంగా సెన్సేషన్ గా నిలిచిన చిదంబరం కేసు లో అనుకోని షాక్ ఎదురైంది . ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది . దేశం విడిచి వెళ్ల కుండా ఆయనపై సీబీఐ ఈడీ లుకవుట్ నోటీసులను జారీ చేశారు . మరో పక్క చిదంబరానికి సుప్రీంకోర్టు లోనూ చుక్కెదురైంది . సర్వోన్నత న్యాయస్థానాని ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది . అరెస్టు చేయకుండా తాత్కాలిక రక్షణ కల్పించాలంటూ చిదంబరం దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయస్థానం ఇవాళ స్పందించింది.


అరెస్టు చేయకుండా ఉండాలని ఇప్పటి కిప్పుడు ఆదేశాలు జారీ చేయలేమని సుప్రీం కోర్టు న్యాయమూర్తి రమణ స్పష్టం చేశారు. ఈ కేసును చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ కు బదిలీ చేసినట్టు ఆయన తెలిపారు. చిదంబరం ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ హై కోర్టు మంగళవారం తిరస్కరించింది. తాను సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకుంటానని అంతవరకు తనను అరెస్టు చేయకుండా తాత్కాలిక రక్షణ కల్పించాలంటూ చిదంబరం చేసిన వినతిని కూడా తోసిపుచ్చింది. అప్పట్నుంచీ చిదంబరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అత్యవసర విచారణ జరపాలా వద్దా అనే విషయం పై సీజెఐ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.



అటు చిదంబరాన్ని సిబిఐ వెంటాడుతోంది. ఇవాళ కూడా సీబీఐ ఈడీ అధికారులు చిదంబరం ఇంటికెళ్లారు. అయితే ఆయన అక్కడ లేరు ఢిల్లీ హై కోర్టులో తీర్పు వెలువడినప్పటి నుంచి సీబీఐ బృందం ఆయన ఇంటికి రావడం ఇది మూడో సారి తాజాగా పరిణమాలతో చిదంబరం ఏ క్షణమైనా అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ తీర్ప్ పై చిదంబరం  ఎలాంటి వ్యూహం ఆలోచిస్తారో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: