ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు తక్కువ క్యాలరీ లు ఎక్కువ విటమిన్స్, మినరల్స్ అందివ్వడం లో వీటికివే సాటి గుండె కు మేలు చేస్తాయి యాంటీఆక్సిడెంట్స్ పెంచటం లో ఉపయోగపడతాయి క్యాన్సర్ నివారణ లో కీలకం గా వ్యవహరిస్తాయి బీపీని అదుపు లో ఉంచుతాయి ఎముకలు పటిష్టం కావడాని కి హానికర బ్యాక్టీరియా ను నిర్మూలించడానికి అరుగుదల పెరగటానికీ ఎంతగానో సహాయపడతాయి ఉల్లిపాయ ధరలకు రెక్కలొచ్చాయి. సగానికి సగం ధరలు పెరిగాయి. కిలో యాభై రూపాయల వరకు అమ్మే అవకాశాలున్నాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదను కోసం ఎదురు చూసే బడా వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తూ ధరలను పెంచేస్తున్నారు.  మన దేశం లోని ప్రతి ఇంట్లో ఏ కూర వండినా అందులో ఉల్లి ఉండి తీరాల్సిందే. నిత్యావసరంగా వాడే ఉల్లి ధరలు ఉన్నట్టుండి పెరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఉల్లి కిలో పన్నెండు రూపాయల నుండి పదహారు రూపాయల వరకూ పలికింది.


వరదలు సాకుగా చూపుతూ బడా వ్యాపారులు తమ వద్ద ఉన్న స్టాకుని కొంత బ్లాక్ చేస్తున్నారు. పది బస్తాల ఉల్లి అడిగిన వారికి ఎనిమిది బస్తాలు ఇస్తూ ఉల్లికి డిమాండ్ వచ్చిందని చెబుతూ కొరత సృష్టిస్తున్నారు. మరోవైపు దిగుమతులు గతంలో కంటే చాలా తగ్గాయి. మహారాష్ట్ర నుంచి ఏపీకి ఎక్కువగా ఉల్లిపాయలు దిగుమతి అవుతుంటాయి. అలాగే సెప్టెంబర్ చివరి వారం నుంచి అక్టోబర్ నవంబర్ మాసాల్లో కర్నూ లు ప్రాంతం నుంచి ఉల్లి సరఫరా అవుతుంది. రెండు రోజుల వ్యవధిలోనే ఉల్లి ధరలు అమాంతం ఎగబాకాయి. కిలో ముప్పై రూపాయల నుంచి ముప్పై ఐదు రూపాయల వరకు అమ్ముతున్నారు. నెల్లూరు జిల్లాలో ఎనిమిది లక్షల కుటుంబాలున్నాయి ఒక్కో కుటుంబం సరాసరిన తక్కువ లో తక్కువ గా వంద గ్రాముల ఉల్లిపాయల వినియోగిస్తుంద ని అనుకుంటే ఆ లెక్కన రోజుకి ఈ జిల్లా వాసులకే ఎనభై వేల కిలోల ఉల్లిపాయల అవసరం. ఒక్కో కిలోకు ఇప్పుడు పదిహేను రూపాయ లకు పైగా అదనంగా ధరలు పెరిగాయి. ఆ లెక్కన జిల్లావాసుల పై ఒక్క రోజుకే పన్నెండు లక్షలు అదనపు భారం పడుతుంది. అదే ఏపీ మొత్తమ్మీద రోజుకి ఒకటి పాయింట్ మూడు కోట్ల దేశ ప్రజలు రోజుకి ముప్పై ఆరు కోట్లు భారం మోయాల్సి వస్తుంది.


ఒకటి రెండు రోజుల్లోనే కిలోకి పదిహేను నుంచి ఇరవై రూపాయల ధర పెరగడం తో ప్రజల్లో ఆందోళన పెరుగు తోంది. మార్కెట్ లో విశ్లేషకులు యాభై రూపాయల వరకు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. గతంలోనూ పలుమార్లు ఉల్లి ఘాటుకు కన్నీళ్లు పెట్టించింది. అప్పటి ప్రభుత్వాలు రైతు బజార్ లో తక్కువ ధరకి ఉల్లిపాయల అందివ్వ గా జనం బారులు తీరేవారు. రోజంతా క్యూ లైన్ లో నుంచుని ఉల్లిపాయులు కొనుగో లు చేయాల్సి వచ్చేది. ఆ రోజులను తలచుకుని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మెత్తం మీద వరదల తాకిడి ఉల్లి  మీద కూడా ప్రభావం పడిందని భావించవచ్చు. ప్రభుత్వాలు ఇప్పటికైనా వెంటనే చర్యలు తీసుకొని బ్లాక్ మార్కెట్ అరికట్టడంతో పాటు అవసరానికి తగ్గట్టుగా ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి తెప్పించటంపై దృష్టి పెడితే పరిస్థితి అదుపు లోకొస్తుందని ప్రజలు వాపోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: