పరిపాలన విషయంలో జగన్ పై దుష్ప్రచారం  చేయటానికి ప్రయత్నించి భంగపడ్డారు తెలుగుదేశంపార్టీ నేతలు. అందుకనే బిజెపి వైపు నుండి నరుక్కు రావాలని టిడిపి ప్లాన్ చేసినట్లు అనుమానంగా ఉంది. ఇందులో భాగంగానే తెలుగు కమలం నేతలు అంటే టిడిపి నుండి బిజెపిలోకి ఫిరాయించిన రాజ్యసభ ఎంపిల ద్వారా జోరుగా ప్రయత్నాలు మొదలుపెట్టారు.

 

ఇందులో భాగంగానే సిఎం రమేష్ ఓ ట్వీట్ ను పెట్టారు. అమెరికా పర్యటనలో ఉన్న జగన్మోహన్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేయటానికి ఇష్టపడలేదట. కాబట్టి జగన్ హిందు వ్యతిరేకే అంటూ తీర్మానించేశారు రమేష్. జ్యోతి ప్రజ్వలన చేయటానికి నిరాకరించటమంటే హిందువులను అవమానించటమేనని రమేష్ ఎలాగ అనుకున్నారో ఆయనకే తెలియాలి.

 

ఎన్నికల సమయంలో హిందువుల ఓట్ల కోసం దేవాలయాల చుట్టూ తిరిగుతూ నటించారని కూడా రమేష్ తీర్మానించేశారు. ఇక్కడే రమేష్ ఓ విషయం మరచిపోయారు. ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తర్వాత జగన్ చేసిన మొదటి పని తిరుమల వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవటమే. అప్పటి నుండి ఎన్నో కార్యక్రమాలకు హాజరైన జగన్ ఎన్నోసార్లు జ్యోతి ప్రజ్వలన చేసిన విషయం అందరూ చూసిందే.

 

కాబట్టి జగన్ కు వ్యతిరేకంగా రమేష్ చేసే ఏ దుష్ప్రచారం కూడా వర్కవుటవదని గ్రహించాలి. జ్యోతి ప్రజ్వలన చేయకపోతేనే జగన్ ను హిందు వ్యతరేకి అయిపోతే మరి సిఎంగా ఉన్న కాలంలో విజయవాడలోనే చంద్రబాబు ఒకరోజు ఎన్నో దేవాలయాలను కూలగొట్టించారు. మరి అప్పుడు చంద్రబాబు కూడా హిందువుల వ్యతిరేకే కదా ?

 

ఇటువంటి చవకబారు రాజకీయాలు చేయటానికే రమేష్ బిజెపిలో చేరినట్లున్నారు. ఇంతకీ ఈ ఎంపి సమస్య ఏమిటంటే రాయలసీమలో రమేష్ చేసిన ఇరిగేషన్ కాంట్రాక్టులు కూడా జగన్ సమీక్షలో ఉన్నట్లున్నాయి.  అసలు బిజెపిలోకి ఫిరాయించిందే అరెస్టు నుండి తప్పించుకోవటానికి. కాబట్టి కేసుల భయంతోనే జగన్ పై రమేష్ నోటికొచ్చినట్లు మాట్లాడేస్తున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: