ప్రకాశం బ్యారేజి వద్ద హెచ్చరిక బోర్డులు వెలిశాయి. ఖానా నెంబర్ 24, 39 వద్ద రెయిలింగ్ లో కదలికలు రావడంతో బ్యారేజ్ పై ద్విచక్ర వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. రెయిలింగ్ బలహీనంగా ఉండటంతో బ్యారేజిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రమాదం ప్రదేశంలో ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఎర్రజెండాలను ఏర్పాటు చేశారు. ప్రకాశం బ్యారేజిపై ప్రస్తుతం ట్రాఫిక్ ఆంక్షలు విధించారు అధికారులు.



ఎందుకంటే ప్రకాశం బ్యారేజ్ ఎక్కడ చూసినా కూడా హెచ్చరిక బోర్డులు దర్శనమిస్తున్నాయి.ఎందుకంటే ప్రకాశం బ్యారేజీ కానా నెంబర్ 39, కానా నెంబర్ 24 వద్ద కాస్త రెయిలింగ్ వంగి పోవటంతో అల్పంగా ఉందంటూ కూడా హెచ్చరిక బోర్డులు వెలిశాయి. ప్రకాశం బ్యారేజ్ మీద కేవలం ద్విచక్ర వాహనాలు మాత్రమే ట్రాఫిక్ పోలీసులు పంపిస్తున్నటువంటి పరిస్థితి.



అది కూడా ఫోర్ వీలర్స్ ని పంపినప్పుడు మాత్రం పెద్ద వాహనాలని పంపించినప్పుడు మాత్రం కేవలం సెక్రటరీ సచివాలయంకి సంబంధించి వీఐపీలు అధికారులు వెళతారు కాబట్టి, విఐపి క్యాడర్ ఉన్న వాహనాలని మాత్రమే పంపిస్తున్నారు. ఇంకా వరద ఉద్ధృతి తగ్గినప్పటికీ కూడా అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి ప్రకాశం బ్యారేజి మీద. అక్కడ ఆ పక్కన కానా నెంబర్ ముప్పై తొమ్మిది కాన నెంబర్ ముప్పై తొమ్మిది తో పాటు కొంచెం ముందు మనకి కానా నెంబర్ ఇరవై నాలుగు కూడా ఉంది.



అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అక్కడ ఎర్రజెండాలు పెట్టి ప్రకాశం బ్యారేజిపై ఎర్రజెండాలు పెట్టి ఒక ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే, కాస్త అల్పంగా ఉంది. గతంలో పది లక్షల క్యూసెక్కుల వరద వచ్చినపుడు కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: