కడప జిల్లాలో టీడీపీ ఖాళీ అవుతోందా. కమలదళం కడపపై ఫోకస్ పెట్టిందా. మాజీ మంత్రి ఆది పార్టీ మారడం లాంఛనమేనా. కడప జిల్లా టిడిపి శ్రేణుల్లో ఇదే హాట్ టాపిక్. జిల్లా టిడిపి నేతలు కమలం వైపు చూస్తున్నారని చర్చ నడుస్తోంది. అయితే మాజీ మంత్రి ఆది వెంట నడిచేదెవరు. కడప జిల్లా ఒకప్పుడు టిడిపికి కంచుకోట అనామకులకు టికెట్ ఇచ్చి గెలిపించుకున్న ఘన చరిత్ర. రెండు వేల నాలుగులో ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో టీడీపీ గత వైభవం మసకబారడం ప్రారంభమయింది.



రెండు వేల నాలుగులో రెండు సీట్లు గెలిస్తే రెండు వేల తొమ్మిదిలో ఒక సీటు, రెండు వేల పద్నాలుగులో ఒకే ఒక సీటు, రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క సీటు కూడా గెలవలేదు. జిల్లాలో టిడిపి ఉనికి ఇలా ప్రశ్నార్థకంగా మారుతూ వచ్చింది. గత ఎన్నికల్లో చావు దెబ్బ తిన్న పార్టీకీ పునరుత్తేజం కల్పించే నాయకులు కరువయ్యారని టిడిపి శ్రేణులు డీలా పడిపోతున్నారట. పక్కపార్టీల్లో గెలిచిన వారిని టిడిపి లోకి తీసుకొచ్చి అందలమెక్కించినందుకు తగిన ప్రతిఫలం దక్కిందని ఆక్రోసిస్తున్నారట. ఇదంతా ఎందుకంటే ముసుగు వీరుడు ముసుగు తీసేశారు. పార్టీని భూస్థాపితం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారన్నది పార్టీ కేడర్ ఆందోళనకు కారణమట.



ఆ ముసుగు వీరుడెవరో చెప్పనక్కరలేదు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి. బీజేపీ కీలక నేత జేపీ నడ్డాను కలిసి బీజేపీలో చేరేందుకు ఆదినారాయణ రెడ్డి ప్రయత్నాలు ప్రారంభించారు. త్వరలోనే ఆయనకు గ్రీన్ సిగ్నల్ వస్తే పార్టీలో చేరడం మాత్రమే మిగిలుంది. ఆది తన వెంట ఎవరిని తీసుకువెళతాడన్న చర్చ పార్టీ కేడర్ లో జరుగుతుందట. పార్టీని నమ్ముకుని పని చేస్తున్నవారిని కాదని ఆదిని అందలమెక్కిస్తే ఇప్పుడు జిల్లాలో పార్టీ ఉనికి లేకుండా చేస్తున్నాడేమో అని పార్టీ క్యాడర్ ఆవేదన చెందుతోంది. వాస్తవానికి అది టిడిపిలో చేరిక ఎవ్వరికీ ఇష్టం లేదు.



అయినా, అధినేత ప్రాముఖ్యత ఇచ్చాడని అక్కున చేర్చుకుంటే తిన్నింటి వాసాలే లెక్కపెట్టాడని వాపోతున్నారట. ప్రస్తుతం ఆదిభట్ల వెళ్లేదెవరో అన్న అన్వేషణ చేస్తున్నారట. బద్వేలు, ప్రొద్దుటూరు, రాజంపేట నియోజక వర్గాలకు చెందిన కీలక నేతలు ఆదితో పాటు వెళ్లే అవకాశముందని పార్టీ కేడర్ అంచనా వేస్తోందట. పార్టీని నమ్ముకుని కష్టపడుతున్న నేతలు పార్టీ వీడనన్న ధీమాతో ఉన్న, ఆపరేషన్ ఆకర్ష్ ఎంతటి వారినైనా లొంగదీసుకుంటుందేమో అన్న ఆందోళనలో కేడర్ ఉందట. వైసీపీలో ఎంట్రీ కి తలుపులు మూసేసిన నేతలకూ బిజెపి రెడ్ కార్పెట్ వేస్తుండడంతో పార్టీని నమ్ముకున్న తమ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం కాక ఆందోళన చెందుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: