కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అరెస్టుతో  ఓ పార్టీ నేతలు ఫుల్లు ఖుఫీగా ఉన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దాదాపు పదేళ్ళ క్రితం అకారణంగా, కక్షసాధింపుతో అప్పట్లో చిదంబరం అరెస్టు చేయించారని వైసిపి నేతలు చెబుతున్నారు. నిజానికి 2009లో కాంగ్రెస్ నేత శంకర్ రావు హై కోర్టుకు ఓ తెల్లకాగితంపై రాసిన ఫిర్యాదునే ఆధారంగా తీసుకుని కేసులు నమోదు చేసిన విషయం గుర్తుండే ఉంటుంది.

 

సోనియా అధికారాన్ని ధిక్కరించి జగన్ కాంగ్రెస్ పార్టీలో నుండి బయటకు రాగానే పార్టీలోని చాలామందికి ఒళ్ళుమండిపోయింది. దాంతో చంద్రబాబు తదితరులతో చీకటి ఒప్పందాలు చేసుకుని శంకరర్రావు ద్వారా జగన్ అరెస్టుకు పావులు కదిపారు. వైఎస్సార్ మరణించగానే ఒక్కసారిగా జగన్ ను క్విడ్ ప్రోకో అనే కేసులు చుట్టుముట్టాయి. ఎటువంటి ఆధారాలు లేకుండానే జగన్ పై సిబిఐ, ఈడిలు కేసులు నమోదు చేసి అరెస్టు చేశాయి.

 

విచారణ పేరుతో అప్పట్లో జగన్ ను దర్యాప్తు సంస్ధలు అదుపులోకి తీసుకుని తర్వాత అరెస్టు చేసి జైలుకు పంపేశాయి. ఎటువంటి కేసులో అయినా మూడు నెలల్లోనే బెయిల్ తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ జగన్ కు మాత్రం కోర్టులు బెయిల్ ఇవ్వలేదు. ఏకంగా 16 మాసాలు జైల్లోనే ఉంచేశారు. సిబిఐ, ఈడి కేసులు, విచారణ, అరెస్టు జగన్ పై తీవ్ర ప్రభావాన్నే చూపాయి.

 

అందుకే అప్పటి నుండి కాంగ్రెస్ అంటేనే జగన్ మండిపోతున్నారు. విచిత్రమేమిటంటే కాంగ్రెస్ రెండు రాష్ట్రాల్లోను ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతు జగన్ పార్టీలోనే ఉండుంటే కేసులు, అరెస్టులు ఉండేవి కావు అనటంతో జగన్ మరింతగా మండిపోయారు. కేసులు నమోదవ్వటం, అరెస్టులు అయినపుడు కేంద్ర హోం మంత్రిగా చిదంబరమే ఉన్నారు. దాంతో సహజంగానే వైసిపి నేతలంతా చిదంబరంపై మండిపోతుంటారు. అందుకే చిదంబరం అరెస్టుతో ఇపుడు వాళ్ళంతా ఫుల్లు హ్యాపీగా ఫీలవుతున్నారు. ఆ విషయం వైసిసి సోషల్ మీడియాను చూస్తే తెలుస్తుంది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: