ఏపీలో పాలనను గాడిలో పెడుతున్న జగన్ వేగవంతంగా నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అభివ్రుధ్ధి, మరో వైపు సంక్షేమం లక్ష్యాలుగా  చేసుకుని జగన్ అడుగులు వేస్తున్నారు. గత టీడీపీ సర్కార్ విధానాలకు భిన్నంగా జగన్ పాలన సాగుతోంది. ఎక్కడికక్కడ అవసరమైన మార్పులు తీసుకురావడం ద్వారా జగన్ ఏపీని రోల్ మోడల్ గా చేయదలచుకున్నారని అర్ధమవుతోంది.


ఇదిలా ఉండగా ఏపీలో ప్రాంతీయ బోర్డులకు జగన్ శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ విషయంపై ఆయన సీరియస్ గానే ఆలోచన చేస్తున్నారట. గతంలో కాంగ్రెస్ పాలనలో ప్రాంతీయ బోర్డులు ఉండేవి, వాటి ద్వారా జిల్లాల్లో సమస్యలు, ప్రాంతీయ అవసరాలు ప్రభుత్వం ద్రుష్టికి వచ్చేవి. ఇక ప్రత్యేకంగా ఈ బోర్డులకు నిధులు ఉండడం వల్ల ఎక్కడికక్కడ అవసరం అయిన చోట ఖర్చు చేస్తూ ప్రాంతీయ అవసరాలను చాలా మటుకు తీర్చేవి. 


దాంతో జిల్లాల్లో సమస్యలు స్థానికంగానే పరిష్కారం  అయ్యేవి. ఇక ఒక్కో జిల్లాలు ఒక్కో సమస్య ఉంటుంది. వాటిని దగ్గరుండి పరిశీలించడం ద్వారా వాటిని తీర్చడంలో కూడా ఈ బోర్డులు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా రైతాంగ, గ్రామీణ ప్రాజనీకం, వెనకబడిన జిల్లాల అభివ్రుద్ధి లక్ష్యంగా పెట్టుకుని ప్రాంతీయ బోర్డులను జగన్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారట


విజయనగరం కేంద్రంగా విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు ఒక బోర్డు, అలాగే ఉభయగోదావరి జిలాలు, క్రిష్ణాను కలుపుకుని కాకినాడ కేంద్రంగా మరో ప్రాంతీయ బోర్డు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలతో గుంటూరు కేంద్రంగా ఇంకో బోర్డు, రాయలసీమ నాలుగు జిల్లాలు కడప కేంద్రంగా మరో బోర్డు ఏర్పాటు చేస్తారని అంటున్నారు. ప్రాంతీయ బోర్డు చైర్మన్లకు క్యాబినెట్ ర్యాంక్ ఇస్తున్నారు. అలాగే వీరి పదవీ కాలం మూడేళ్ళు ఉంటుంది.


ప్రాంతీయ బోర్డు చైర్మన్లు జిల్లా సమీక్షా మండలి సమావేశానికి ప్రత్యక ఆహ్వానితులుగా వెళ్ళే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇక భారీగా నిధులను కూడా బోర్డులకు ఇవ్వనున్నారు. సీనియర్ నేతకు బోర్డ్ చైర్మన్ గా నియమించి వ్యవసాయ, నీటి పారుదల రంగాలకు చెందిన నిపుణులకు బోర్డ్ మెంబర్లుగా నియమిస్తారు. మొత్తం మీద ప్రాంతీయ బోర్డుల నియామకంతో ఇటు అభివ్రుద్ధితో పాటు, అటు వైసీపీలోని సీనియర్లకు పదవుల కొరత కూడా తీరుతుందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: