అసత్య ప్రచారాలు చేస్తు జగన్మోహన్ రెడ్డిపై బురదచల్లే ప్రయత్నాలు చేస్తున్న నారా లోకేష్ బృందంపై  చర్యలు తీసుకోవాలని  వైసిపి నేతలు డిమాండ్ చేస్తున్నారు. విధానపరమైన నిర్ణయాలను ప్రశ్నించటంలో తప్పేమీలేదు. ప్రభుత్వంలో తప్పులు జరిగితే నిలదీయాల్సిందే. కానీ ఉద్దేశ్యపూర్వకంగా ముఖ్యమంత్రిపై బురదచల్లుతు, ప్రభత్వం పరువు తీయాలని చేసే ప్రయత్నాలను ఎలా అర్ధం చేసుకోవాలి ?

 

చినబాబు నారా లోకేష్ బృందం చేసిందదే. వరదల సహాయకచర్యలపై జగన్మోహన్ రెడ్డితో పాటు మంత్రి అనీల్ కుమార్ యాదవ్ ను నోటికొచ్చినట్లు తిట్టించారు ఓ పెయిడ్ ఆర్టిస్ట్ తో టిడిపి నేతలు. ఆ వీడియో చిత్రీకరణలో చంద్రబాబునాయుడు, లోకేష్ పాత్ర ఉండకుండా ఉండదు. ఎందుకంటే, టిడిపి తరపున విడుదలయ్యే ఏ ఆడియో అయినా వీడియో అయినా తండ్రి, కొడుకులకు తెలీకుండా జరగదు.

 

పైగా రైతు వేషంలో టిడిపి పెయిడ్ ఆర్టిస్ట్ జగన్, అనీల్ ను తిడుతున్న వీడియోను స్వయంగా లోకేషే తన ట్విట్టర్లో పెట్టి ప్రచారం చేస్తున్నారు. అంటే జగన్ పై తప్పుడు ప్రచారం చేయటానికి లోకేష్ ఎన్నుకున్న తప్పుడు మార్గమని ఇట్టే తెలిసిపోతోంది. టిడిపి హయాంలో తమను నిలదీస్తున్నారని ఎంతమంది వైసిపి సోషల్ మీడియా అభిమానులపై కేసులు పెట్టి అరెస్టులు చేయించారో చంద్రబాబు, లోకేష్ గుర్తు చేసుకోవాలి.

 

అప్పట్లో నిజాలు మాట్లాడినా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ సుమారు ఓ 15 మందిపై కేసులు పెట్టి చంద్రబాబు, చినబాబు  జైళ్ళకు పంపిన విషయం అందరికీ తెలిసిందే. అప్పట్లో నిజాలు మాట్లాడినా కాకపోతే వ్యంగ్యంగా ఉండే పోస్టులు పెట్టిందానికే తండ్రి, కొడుకులకు మండిపోయింది. మరి ఇపుడు ఉద్దేశ్యపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గబ్బు పట్టించటానికి టిడిపి చేస్తున్న కుట్రను ఏమనాలి ? ఇటువంటి దుష్ప్రచారం కుట్రను ఆదిలోనే అడ్డుకోకపోతే ముందు ముందు జగన్ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సుంటుంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: