అదే అనుమానం అందరిలోను మొదలైంది. తెలుగుదేశంపార్టీ నుండి చాలామంది మాజీ మంత్రులు, మాజీ ఎంఎల్ఏలు, ఎంఎల్ఏలతో సహా తమ పార్టీలోకి వచ్చేయబోతున్నట్లు బిజెపి అగ్ర నేతలు చాలామంది ఆమధ్య ఒకటే ఊదరగొట్టారు. తీరా చూస్తే టిడిపిలో గట్టిపట్టున్న నేతల్లో ఒకళ్ళిద్దరు తప్ప ఇంకెవరూ రాలేదు. వచ్చిన ఇద్దరు ముగ్గురు కూడా జనాలతో ఎటువంటి సంబంధం లేనివాళ్ళే అన్న విషయం తెలిసిపోతోంది.

 

మొన్నటి ఎన్నికల్లో టిడిపికి ఘోర పరాజయం ఎదురవ్వటంతో బిజెపినే ప్రత్యామ్నాయంగా చాలామంది టిడిపి నేతలు ఎంచుకున్నారు. జేసి దివాకర్ రెడ్డి, రాయపాటి సాంబశివరావు, పరిటాల సునీత, పల్లె రఘునాధరెడ్డి, భూమా అఖిలప్రియ, మీనాక్షినాయుడు లాంటి చాలామంది మాజీ మంత్రులు, మాజీ ఎంపిలు, మాజీ ఎంఎల్ఏలు తమ పార్టీల్లోకి రావటానికి ఉత్సాహం చూపుతున్నట్లు కమలనాధులు చెప్పుకున్నారు.

 

అంతా బాగానే ఉంది కానీ రోజులు గుడుస్తున్నా బిజెపిలో చేరటంపై వీళ్ళ నుండి ఎటువంటి రెస్పాన్స్ రావటం లేదట. కారణాలేమిటని ఆరా తీస్తే టిడిపిలో నుండి బిజెపిలోకి ఫిరాయించిన రాజ్యసభ ఎంపిలే కారణమని అంటున్నారు. వీళ్ళల్లో కూడా సిఎం రమేష్, సుజనా చౌదరిపైనే అందరూ మండిపడుతున్నట్లు సమాచారం. వీళ్ళు టిడిపిలో ఉండగా తమను ప్రశ్నించేవారిని, తమ మాట వినరు అనే అనుమానం ఉన్న నేతలను తొక్కిపడేశారనే ఆరోపణలున్నాయి.

 

టికెట్ల పంపిణీలోను, నిధుల పంపకాల్లోను వీళ్ళద్దరే టిడిపిలో ప్రముఖ పాత్ర పోషించేవారు. దాంతో తామంటే గిట్టని చాలామంది నేతలకు ప్యారలల్ గా వేరే నేతలను ప్రోత్సహించారు. రమేష్ పై కడప జిల్లాలో మాజీ ఎంఎల్ఏ వరదరాజుల రెడ్డిని అడిగితే చెబుతారు. ఇక సుజనాపై ఉన్న ఆరోపణలకు కొదవే లేదు. టిడిపిలో అన్నీ విధాలుగా అధికారాలను చెలాయించి ఇపుడు పార్టీ ఒట్టిపోగానే వెంటనే బిజెపిలో చేరిపోయారు. దాంతో మళ్ళీ వీళ్ళతో ఏగలేమన్న కారణంతో చాలామంది టిడిపి నేతలు వెనక్కు తగ్గినట్లు ప్రచారం జరుగుతోంది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: