తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్టాల‌కు చెందిన నేత‌ల‌కు గుడ్ న్యూస్‌. ముఖ్యంగా తెలంగాణ‌లోని నాయ‌కులకు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న విధంగా అసెంబ్లీ సీట సంఖ్యను పెంచేందుకు మ‌రో ముంద‌డుగు ప‌డే చాన్స్ కనిపిస్తోంది. అసెంబ్లీ సీట్ల పెంపునకు రెండు రాష్ర్టాల్లోని బీజేపీ నాయకులు గ‌తంలో మోకాలడ్డిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఇప్పుడు వారే మ‌న‌సు మార్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సీట్ల‌ను పెంచాల‌ని కోరుతున్నారు.


ఇటీవ‌ల జ‌రిగిన‌ ఎన్నిక‌ల స‌మ‌యంలోనే,  తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచడానికి కేంద్రం సుముఖంగానే ఉన్నా రెండు రాష్ర్టాల్లోని బీజేపీ నేతలు అడ్డుపుల్ల వేయడంతో ఈ ప్రక్రియకు బ్రేకులు పడ్డాయి. సీట్లను పెంచడంద్వారా 2019 సాధారణ ఎన్నికల్లో రెండు రాష్ర్టాల్లోనూ బీజేపీకంటే అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్, టీడీపీలకే ఎక్కువ ప్రయోజనమని జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు రెండు రాష్ర్టాల్లోని బీజేపీ నాయకులు తెలిపారు. ఈ విషయాన్ని అమిత్ షా స్వయంగా ఢిల్లీలో మీడియాకు వెల్లడించారు.


అయితే, తాజాగా తెలంగాణ‌లో సీన్ మారిపోయింది.  పలువురు సీనియర్ నేతల చేరికలతో ఉత్సాహంలో ఉన్న రాష్ట్ర బీజేపీ ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. రాష్ట్రంలో అర్బన్ ప్రాంతాల్లో పట్టుపెరుగుతోందని భావిస్తున్న పార్టీ నేతలు ఈ ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. డీలిమిటేషన్ తో అసెంబ్లీ సీట్లు పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ వస్తాయి కాబట్టి తమకు బాగా కలిసొస్తుందని వారు అంచనా వేస్తున్నారు. ఇదే లాజిక్‌ను పార్టీ హైకమాండ్ ముందు ఉంచినప్పుడు సానుకూలంగా స్పందన వచ్చినట్లు సమాచారం. దీంతో ఈ ప్రతిపాదనను వేగంగా ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. కాగా, తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లను 119 నుంచి 153కి, ఏపీలో 175 నుంచి 225కి పెంచాలని చట్టంలో ఉంది. ఈ 



మరింత సమాచారం తెలుసుకోండి: