మనదేశంలో ఆధార్ కార్డు అనేది ప్రతి ఒక్క భారతీయుడుకి ఒక గుర్తింపు. అతని గురించి ఆర్థికపరమైన లేదా ఇతర వివరాలను తెలుసుకునేందుకు ఇది చాలా దోహదపడుతుంది. ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం అందరిని వారి బ్యాంక్ అకౌంట్, ఫోన్ నెంబర్ లకు భద్రత మరియు పారదర్శకత కోసం ఆధార్ లింక్ చేయమని చెప్పారు. మరి ఇప్పుడేమో మీ సోషల్ మీడియా అకౌంట్లు అంటే అన్ని సామాజిక మాధ్యమాలకు ఆధార్ అనుసంధానం చేయడం తప్పనిసరి అయ్యే రోజులు వచ్చేశాయి.

తమిళనాడు గవర్నమెంట్ సోషల్ మీడియా అకౌంట్ లను ఆధార్ లింక్ చేసే విధంగా రూలు రావాలని తమిళనాడు హైకోర్టులో ఒక పిటిషన్ వేసింది. కేవలం తమిళనాడు ప్రభుత్వమే కాకుండా మధ్యప్రదేశ్ మరియు ముంబై హైకోర్టులో ప్రజాసక్తి కలిగిన లిటిగేషన్ ల కింద మరో మూడు చోట్ల పిటిషన్లు వేయడం జరిగింది. 

అయితే సామాజిక మాధ్యమాలు అన్నిటిలోకి అత్యంత ప్రజాదరణ మరియు పాపులర్ వెబ్ సైట్ అయిన ఫేస్ బుక్ ఈ పిటిషన్లను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తమిళనాడు గవర్నమెంట్ పిటీషన్ లో ఫేస్ బుక్, వాట్సాప్ మరియు ట్విట్టర్ వల్ల జనాల్లో హింసాత్మకమైన ఆలోచనలు ఉద్భవిస్తున్నాయని, కొన్ని నేరాలు కూడా జరుగుతున్నాయని గత కొద్ది సంవత్సరాల రిపోర్టులను ముందు ఉంచారు. తమిళనాడు గవర్నమెంట్ తరఫున న్యాయవాది ఆధార్ లింక్ చేయడం వల్ల నిషేధ సమాచారం మరియు టెర్రరిస్టు కార్యకలాపాలు తగ్గి, నిందితులను అతి త్వరగా పట్టుకునే అవకాశం ఉంది అని చెప్పుకొచ్చారు. 

కానీ ఫేస్ బుక్ మాత్రం అలా చేయడం వల్ల తమ వినియోగదారుడి గోప్యతను భంగం కలుగుతుందని వాదిస్తుంది. తమ కస్టమర్ విలువైన సమాచారం, ఫోన్ నంబర్, ఈమెయిల్ వంటి సున్నితమైన సమాచారాన్ని తాము ఎలా ఇస్తామని అన్నారు. అయితే దీనిపై నిర్ణయం తీసుకునేందుకు హై కోర్టు కి ఎలాంటి హక్కు లేదు. కేవలం సుప్రీం కోర్టు మాత్రమే దీనిపైన నిర్ణయం తీసుకుంటుంది. 

ప్రస్తుతానికి ఈ కేసుని సెప్టెంబరు 13కి వాయిదా వేశారు. ఇరువురి వాదనలు విని న్యాయస్థానం వారి నిర్ణయాన్ని ప్రకటిస్తారు. అయితే ఇలా సోషల్ మీడియా అకౌంట్లకి ఆధార్ అనుసంధానం చేయడం వల్ల మన సమాచారం భద్రంగా ఉంటుంది అంటారా? మనం వాటిని ఇంతకు మునుపు లా వాడగలమా? చూద్దాం ఏమవుతుందో..!


మరింత సమాచారం తెలుసుకోండి: