రివర్స్ టెండరింగ్ విషయంలో ముందుకు వెళ్ళొద్దంటూ ఏపీ ప్రభుత్వంకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది హైకోర్ట్. పోలవరం హైడల్ ప్రాజెక్ట్ కాంట్రాక్టు రద్దు పిటిషన్ పై హైకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. పోలవరం కాంట్రాక్టు రద్దుపై నవయుగ సంస్థ కోర్టులో పిటిషన్ వేసింది. పిటిషన్ ను విచారించిన కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. 
 
పోలవరం నిర్మాణానికి సంబంధించి రీ టెండర్ కు వెళ్ళే అంశంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద ఇప్పటివరకు పనులు చేసిన నవయుగ సంస్థ కోర్టును సోమవారం రోజు ఆశ్రయించింది. సోమవారం రోజు ఈ విషయంపై విచారణ చేపట్టిన కోర్టు తీర్పును మాత్రం రిజర్వులో ఉంచింది. ఈ వివరాలను ఈరోజు కోర్టు వెల్లడించింది. ఈ విషయంలో ప్రభుత్వానికి హైకోర్ట్ మార్గనిర్దేశాలు జారీ చేసింది. 
 
ప్రభుత్వం రీటెండర్ కు పోకుండా ఉండాలని ఏపీ ప్రభుత్వం ఈరోజు స్పష్టమైన తీర్పును ఇచ్చింది. రివర్స్ టెండరింగ్ నిలుపుదల చేయాలని హైకోర్టు ఆదేశాల్లో స్పష్టంగా చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం విషయంలో రివర్స్ టెండరింగ్ కు వెళ్ళటానికి నోటిఫికేషన్ కూడా ఇప్పటికే జారి చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరపున న్యాయవాదులు, నవయుగ సంస్థ తరపున న్యాయవాదులు తమ వాదనలను వినిపించారు. 
 
ఇద్దరి వాదనలను విన్న హైకోర్ట్ తీర్పును రిజర్వు చేసి ఈరోజు స్పష్టమైన ఆదేశాలను ఇచ్చింది. ఇప్పటివరకు ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని, ఏ కారణం లేకుండా పక్కన పెట్టారని, ప్రభుత్వం రీ టెండరింగ్ కు వెళ్ళాలని ప్రయత్నిస్తోందని ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తమ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ఉన్నాయని నవయుగ సంస్థ తరపు న్యాయవాదులు వాదించినట్లు తెలుస్తుంది. హైడల్ ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో ఏపీ జెన్ కో స్థలాన్ని చూపించకపోవటం వలనే ఇప్పటివరకు నిర్మాణం జరపలేదని నవయుగ తరపు న్యాయవాదులు చెప్పారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: