హిందుత్వవాదం, అభివృద్ధి, సుస్థిర పాలన, దేశ రక్షణ వంటి అంశాలతో ప్రజల్లోకి వెళ్లి అనేక రాష్ట్రాల్లో పాగా వేసిన బీజేపీ, త్వరలోనే హర్యానాలో జరగబోతున్న ఎన్నికలకు సిద్ధం అవుతున్నది.  హర్యానాలో ప్రస్తుతం బీజేపీ పాలన ఉన్నది.  ఖట్టర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.  కేంద్ర మంత్రులు వరసగా అక్కడ ప్రచారం చేస్తున్నారు. ఈసారి కూడా ఎలాగైనా తిరిగి అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తున్నది.  జమ్మూ కాశ్మీర్ సమస్యపై కేంద్రం తీసుకున్న నిర్ణయంతో బీజేపీ హవా పెరిగింది. 


దీంతో హర్యానాలో అధికారంలోకి రావడం పెద్ద విషయం ఏమీకాదు.  అవినీతి ఎక్కడ జరిగినా వారిని వదిలేది లేదని చెప్తూ .. దానికి తగ్గట్టుగా చిదంబరాన్ని అరెస్ట్ చేయించింది.  హర్యానాలో ఎన్నికలు జరగబోయే ముందు చిదంబరం అరెస్ట్ అన్నది కీలకంగా మారింది.  ఇది బీజేపీకి ఖచ్చితంగా ప్లస్ అవుతుందని భావిస్తోంది.  ఇదంతా బాగుంది.  అయితే, హర్యానాలో ప్రజా ఆశీర్వాద యాత్ర పేరుతో బీజేపీ నాయకులు ప్రజల వద్దకు వెళ్లి వారి ఆశీర్వాదాలు తీసుకోబోతున్నారు.  


దీనికోసం హర్యానాలోని ప్రతి నగరంలో, పట్టణంలోను ఏర్పాట్లు చేస్తున్నారు.  ఇందులో భాగంగా థానేవర్ నియోజక వర్గంలోని హతీరా గ్రామాలో జన ఆశీర్వాద యాత్రకోసం ఏర్పాట్లు చేశారు.  ఈ ఆశీర్వాద యాత్రకు ముఖ్యమంత్రి హరిలాల్ కట్టర్ హాజరు కావాల్సి ఉన్నది.  అయన వచ్చే ముందు ప్రజల కోసం కొన్ని ఎంటర్టైనర్ కార్యక్రమాలను ఏర్పాటు చేసింది.  ఎంటర్టైనర్ కార్యక్రమాలు అంటే పాటలు పాడటం మాత్రమే కాదు.. అంతకు మించేలా చేశారు.  


ప్రజలు కోసం కొంతమంది మహిళా డ్యాన్సర్లతో అశ్లీల నృత్యాలను ఏర్పాటు చేశారు.  ఈ డ్యాన్సర్లు వేదికపై డ్యాన్స్ చేస్తూ అక్కడికి వచ్చిన ప్రజలను ఎంటర్టైన్ చేశారు.  ఈ విషయం బయటకు వచ్చింది.  దీనికి సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో షేర్ అయ్యాయి.  అంతే.. ఇది క్షణాల్లో వైరల్ అయ్యింది.  ఆశీర్వద యాత్రలో అశ్లీల నృత్యాలు ఏంటి అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరి దీనిపై బీజేపీ అధిష్ఠానం ఎలా స్పందిస్తుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: