కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి చిదంబరం అరెస్ట్ ఇప్పుడు దేశ రాజకీయాల్లో ప్రకంనలు రేపుతోంది. సీబీఐ అధికారులు అరెస్ట్ చేసి కోర్ట్ నుంచి 5 రోజులు కస్టడీ కూడా అడిగారు. ఇప్పుడు చిదంబరం సీబీఐ ప్రత్యేక సెల్ లో ఉన్నారు. ఐఎన్ఎక్స్ కేసులో చిదంబరంను పోలీసులు అరెస్ట్ చేశారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు అవినీతికి పాల్పడినట్టు పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే కేంద్రం చిదంబరం ను అంత తేలికగా వదిలిపెట్టే రకంగా కనిపించడం లేదు. తాజాగా ఈ కేసును విచారిస్తున్న ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి రాకేష్ అహుజాపై బదిలీ వేటు వేసింది. ఇతను కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా పని చేశారు. దీనితో రాకేష్ ఎక్కడ చిదంబరంకు మేలు చేస్తాడని ఢిల్లీకి బదిలీ చేశారు. 


అయితే ఎన్నో  నాటకీయ పరిణామాల మధ్య చిదంబరం అరెస్ట్ జరగడం గమనార్హం. ఢిల్లీ హై కోర్ట్ అరెస్ట్ విషయంలో స్టే ఇవ్వటానికి నిరాకరించడంతో చిదంబరం సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించారు. కానీ సుప్రీం కోర్ట్ కూడా చిదంబరంకు స్టే ఇవ్వటంలో నిరాకరించింది. దీనితో 24  గంటలు అజ్ఞాతవాసంలోకి పోయిన చిదంబరం దిల్లోని కాంగ్రెస్ కార్యాలయంలో కనిపించారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఎఫ్ఐఆర్  నమోదు అయినంత మాత్రానా తప్పు చేసినట్టు కాదని చెప్పి అనంతరం జోర్బాగ్లోని ఇంటికి చిదంబరం వెళ్లారు. 


సీబీఐ ఈడీ అధికారులు అక్కడికి చేరుకోగా చిదంబరం వ్యక్తి గత సిబ్బంది సీబీఐ ఆఫీసర్స్ ను అడ్డుకొని గేట్లు వేశారు. దీంతో సీబీఐ సిబ్బంది గోడదూకి లోపలికి ప్రవేశించి ఢిల్లీ పోలీసుల సహాకారంతో చిదంబరాన్ని అరెస్ట్ చేశారు. అయితే ఈ అరెస్ట్ వెనుక అమిత్ షా ప్రతీకారం ఉందని వార్తలు వచ్చిన సంగతీ తెలిసిందే. అయితే కేంద్రంలో యూపీయే ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కేంద్ర హోంమంత్రిగా చిదంబరం ఉన్నారు. అప్పట్లో ఆయన కేంద్రంలో కీలకంగా వ్యవహరిస్తూ.. చక్రం తిప్పారు. ఆ సమయంలో గుజరాత్ హోంమంత్రిగా ఉన్న అమిత్ షాను పలు కేసుల్లో నిందితుడిగా పేర్కొంటూ అరెస్ట్ చేయించి .. జైల్లో వేయించారు. దీనితో అమిత్ షా ఇప్పుడు అధికారంలో ఉండటంతో అది కూడా కీలకమైన హోమ్ మినిస్టర్ హోదాలో ఉండటంతో చిదంబరంను అరెస్ట్ చేయించి ప్రతి కారం తీర్చుకున్నాడని అర్ధం అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: