చంద్రబాబు 2014 నుంచి 2019 వరకు ఐదేళ్లు పని చేశారు. గత ఐదేళ్లలో ఏపీలో ఏమైనా అభివృద్ధి ఉందా అని వెతికితే ఎక్కడ కనిపించదు. కానీ కనీసం మూడు నెలలు కూడా నిండని వైసీపీ ప్రభుత్వం మీద చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు. పెట్టుబడులు వెనక్కి పోతున్నాయని, రాజధానిలో భూముల రేట్లు పడిపోయాయని .. ముసలి కన్నీరు కారుస్తున్నారు. గత ఐదేళ్లలో కనీసం ఒక కంపెనీ అయిన పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చి ఉంటే ఇప్పుడు వెనక్కి వెళ్లవు. అసలు ఏపీకే రానటువంటి కంపెనీలు జగన్ వచ్చిన మూడు నెలల్లోనే వెనక్కి ఎలా వెళ్లి పోతాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి విషయంలోనూ చంద్రబాబే దోషిగా నిలబడతారు. తాను చేసిన తప్పులను కూడా జగన్ ఖాతాలోకి వేయడానికి చాలా కష్ట పడుతున్నారు. 


చంద్రబాబు ప్రతి పక్షంలో ఉన్నప్పుడు ఎక్కడ లేని ఫ్రస్ట్రేషన్ చూపించడం బాబుగారికి అలవాటు. రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా బాబు గారి ఫ్రస్ట్రేషన్ క్లియర్ గా అర్ధం అయిపోయేది. అయితే ఇప్పుడు కూడా చంద్రబాబు ప్రతి పక్షంలో కూర్చోవటంతో అది కూడా జగన్ లాంటి తక్కువ వయసు ఉన్న నేత ముందు ఇక ఫ్రస్ట్రేషన్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. 'పిచ్చా? రాష్ట్రానికి శని పట్టిందా? ఎందుకు ఈ మూర్ఖపు నిర్ణయాలు..' అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు విరుచుకుపడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. పోలవరం విషయంలో రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించడంతో చంద్రబాబుకు ఎక్కడ లేని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


పోలవరం రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని జగన్ ఫిక్స్ అవ్వటంతో పోలవరం పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పోలవరంకు సంభందించి నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. అయితే జగన్ ఈ  నిర్ణయం తీసుకోవటానికి బలమైన కారణాలే కనిపిస్తున్నాయి. టీడీపీ హయాంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పోలవరం పనుల్లో వేగమనేది లేకుండా పోయింది. ఎక్కడి పనులు అక్కడే నత్తనడకగా సాగినాయి. దీనిని గమనించిన జగన్ కాంటాక్ట్ ను రద్దు చేసి కొత్తగా వచ్చే కంపెనీ మీద ఒత్తిడి పెట్టి పనులను చక చక పరుగులు పెట్టించాలని భావిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: