ప్రధాని మోడీ విదేశీ పర్యటనల్లో బీజీబీజీగా గడుపుతున్నారు. ఇప్పటికే  ఫ్రాన్స్ వెళ్లిన ఆయన యూఏఈ, బహ్రెయిన్ లలో పలు ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మళ్లీ ఈ నెల 25న ఫ్రాన్స్‌కు వచ్చి జీ7 శిఖరాగ్ర సమావేశాలకు హాజరవుతారు. ప్రధాని మోదీ ఫ్రాన్స్‌లో అడుగుపెట్టగానే చార్లెస్ ది గాలే ఎయిర్‌పోర్టులో ఆయనకు ఘనస్వాగతం లబించింది. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా చాటే ది చాంటిల్లికి వెళ్లిన మోడీ.. అక్కడ ప్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మార్కెన్ తో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. రక్షణ, అణు శక్తి, సముద్రం, ఉగ్రవాదం వంటి అంశాలపై మాక్రెన్ తో మాట్లాడారు. పారిస్‌లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో భారతీయులను ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. 


ఫ్రాన్స్ పర్యటన తర్వాత మోడీ యూఏఈ, బహ్రెయిన్‌లకు వెళ్లనున్నారు. అనంతరం 25న తిరిగి ఫ్రాన్స్ కు వచ్చి జీ7 శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొననున్నారు. అబుదాబి యువరాజు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో సమావేశమవుతారు. తర్వాత బహ్రెయిన్‌కు వెళ్లి ఆ దేశ ప్రధాని షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫాతో చర్చలు జరుపుతారు. అనంతరం ఆగస్టు 25న జీ-7 సదస్సులో పాల్గొనేందుకు తిరిగి ఫ్రాన్స్‌కు చేరుకోనున్నారు ప్రధాని మోడీ.


కాగా, ఫిబ్రవరిలో పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో భారత్ ఎయిర్ స్ట్రైక్స్ చేసిన తర్వాత ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో పాకిస్తాన్ తన గగనతలాన్ని మూసేసింది. మేలో పాకిస్తాన్ గగతలాన్ని తెరిచిప్పటికీ ప్రధాని మోడీ ఆ మార్గంలో వెళ్లలేదు. ఫ్రాన్స్ పర్యటన కోసం పాకిస్తాన్ గగనతలం మీదుగా ప్రయాణించారు ప్రధాని మోడీ. దీన్నిబట్టి ప్రధాని మోడీ ఎంత గుండెధైర్యం కలిగిన వ్యక్తో అర్థమవుతోంది. బాలకోట్ దాడుల సందర్భంగా పాక్, భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. మన సైన్యం ఎంతో అప్రమత్తంగా ఉండి దేశ రక్షణకు కృషి చేస్తుండగా.. ప్రధాని మోడీ పాక్ గగనతలంపై వెళ్లడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 







మరింత సమాచారం తెలుసుకోండి: