భూప్రపంచానికి ఎక్కువ స్థాయిలో ఆక్సిజన్ అందించే అమెజాన్ అడవులు నిత్యం అంటుకుంటూనే ఉన్నాయి. బ్రెజిల్ లో ఉన్న ఈ అడవులు ప్రతి సంవత్సరం రికార్డు స్థాయిలో దగ్ధమవుతున్నట్లు తెలుస్తుంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 84 శాతం అధిక మొత్తంలో అడవులు దగ్ధమయినట్లు సమాచారం. అమెజాన్ అడవుల్లో చెట్ల నరికివేత కూడా ఎక్కువగా జరుగుతుందని ఒక ఏజెన్సీ రిపోర్టులో తెలిసింది. 
 
నాలుగు రోజుల క్రితం కూడా భారీ స్థాయిలో ఈ అడవుల నుండి నల్లని పొగ వెలువడిందని తెలుస్తుంది. పర్యావరణవేత్తలు మాత్రం వ్యవసాయం కొరకు రైతులు అడవులను నరికివేస్తున్నారని ఈ కారణం వలనే అడవులు దగ్ధం అవుతున్నాయని అభిప్రాయం వ్యక్తం చేసారు. నాసా మాత్రం ఈ మంటలు సగటుతో పోలిస్తే తక్కువగా ఉన్నాయని చెప్పినట్లు సమాచారం. అమెజాన్ అడవుల దగ్ధంపై టాలీవుడ్ కు చెందిన సినీ ప్రముఖులు స్పందించారు. టాలీవుడ్ హీరోలైన మహేశ్ బాబు, సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్ హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, హన్సిక ఈ వార్తపై స్పందించారు. 
 
భూమికి ఊపిరితిత్తుల్లాంటి అడవులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెట్లను నాటి మార్పు తీసుకురావాలని మహేశ్ బాబు స్పందించారు. అడవులు దగ్ధమైతే వాతావరణంలో ఊహించని మార్పులొస్తాయి. అమెజాన్ అడవులు కాలిపోతుందనే విషయం ఎంతో బాధించిందని అల్లు అర్జున్ స్పందించారు. పర్యావరణం పచ్చగా ఉంచటం కోసం మనవంతు కృషి చేయాలని రకుల్ స్పందన వ్యక్తం చేసారు. 
 
అమెజాన్ అడవుల కోసం ప్రార్థిస్తున్నానని ఆ అడవుల్లో నివసించే ప్రజల్ని ఓదార్చలేని పరిస్థితి వచ్చిందని హన్సిక ఆవేదన వ్యక్తం చేసింది. హీరో సాయితేజ్ స్పందిస్తూ అడవులు కాలిపోతుంటే ఊపిరి ఆడటం లేదని మంటలు ఆగుతాయని ఆశిస్తున్నానని చెట్లను నాటాలని అన్నారు. బాలీవుడ్ కు చెందిన అలియా భట్, అనుష్క శర్మ, అక్షయ్ కుమార్ అమెజాన్ అడవులు దగ్ధం కావటం పట్ల ఆవేదన వ్యక్తం చేసారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: