ప్రతి మనిషి మెదడులో ఎన్నో ఆలోచనలు మెదులుతుంటాయి,అందులో కొన్నీంటికి సమాధానం దోరికితే, మరికొన్ని నిగూఢంగా  నిక్షిప్తమై మదిలోనే దాగుతాయి,ఆ ఆలోచనల్లో తరచుగా మెదిలే విషయం,దయ్యాలున్నాయా అని.కొందరు వున్నాయంటారు,మరికొందరు లేవంటారు.ఇలా ఎవరికి తోచిన విధంగా వారు వాదిస్తూ వుంటారు.ఎవరెన్ని చెప్పిన దయ్యాలు న్నాయని నమ్మేవారి సంఖ్య ఎక్కువని చెప్పవచ్చు.ఇంతకు ఉన్నాయాలేవా అంటే ఇక్కడ జరిగిన సంఘటనతో ఉన్నాయో లేవో మీరేచెప్పండి.



అమెరికాలోని లాంగ్ ఐలండ్‌కు చెందిన జోయ్ నోలన్ మాత్రం దెయ్యాలు ఉన్నాయని బల్లగుద్ది మరీ వాదిస్తున్నాడు. కావాలంటే చూసుకోండి అంటూ,తన ఇంట్లోని సీసీటీవీ కెమెరాలో రికార్డైన దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అందరూ నిద్రపోతున్న వేళ తాను వుంటున్నఇంట్లో ఎవరో తిరుగుతున్న అలికిడి అవడంతో అనుమానం వచ్చిందని, లేచి చూస్తే ఎవరూ కనిపించే వారు కాదని,తాను మళ్లీ పడుకోగానే ఎవవరో అటు ఇటు తిరుగుతున్నట్లు శబ్దాలు వచ్చేవని చెప్పు కొచ్చాడు.ఎందుకైనా మంచిదని అనుమానం వచ్చి తన ఇంట్లోని సీసీటీవీ కెమెరా పుటేజిని పరిశీలిస్తే అసలు విషయం బయటపడిందని పేర్కొన్నాడు.ఆ దృష్యాలు చూసిన తాను ఉలిక్కిపడ్డానని ఆ వీడియోలో ఓ కుక్కపిల్ల ఆకారం,ఓ పిల్లాడి రూపు కనిపించిందని,అవేంటో నాకు తెలుసు వాటిని మీరేమంటారో తెలుసుకోవాలని ఈ  దృష్యాలను యూట్యూబ్‌లో పోస్టు చేసానని వెల్లడించారు జోయ్.ఇవి దెయ్యాలేనా అని  ప్రశ్నిస్తున్నా నెటిజన్లను అంటూ,అడిగే వీడియో క్షణాల్లోనే వైరల్ అయింది.



జోయ్ పోస్టు చేసిన వీడియో ను చూసిన కొందరు నెటిజన్లు తమకు తోచిన సలహాలు ఇస్తున్నారు.మరికొందరైతే ‘మీ ఇంట్లో ఇటీవలి కాలంలో ఎవరైనా చనిపోయారా?’ అని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా ఆ వీడియోలో స్పష్టంగా ఏమీ కనిపించడం లేదని, కాకపోతే,ఏవో రెండు ఆకారాలు తిరుగుతున్నట్టుగా ఉందని ఓ నెటిజన్ పేర్కొన్నాడు.మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారా అనే ప్రశ్నకు జోయ్ బదులిస్తూ,ఈ మధ్య ఎవరూ చనిపోలేదని,కాకపోతే ఈ సంఘటన ఆగస్టు 8 నాడు మాత్రమే జరిగిందని పేర్కొ న్నాడు.దీనిని బట్టి చూస్తుంటే ఈ ఇన్‌స్టంట్‌కి,ఆగస్టు 8కి ఏదో దగ్గరి సంబంధం ఉందని,అనిపిస్తోందని చెప్పుకొచ్చాడు. ఇది నిజమో అబద్దమో ఇక మీరే తేల్చుకోవాలి అన్నాడు,ఏది ఏమైన ఇలాంటి సీన్లు మనం సినిమాల్లోనే చూస్తుంటాం కాని ఇది నిజంగా జరిగిందంటూ జోయ్ చెప్పడం వినడానికి విచిత్రమనిపిస్తుంది అంటున్నారు దయ్యాలను నమ్మని కొందరు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: