కృష్ణ నది కి వరద తెచ్చారు

 

ఈ మధ్య కృష్ణ నది లో సంభవించినది వచ్చిన వరద కాదని తెచ్చిన వరద అని తెలుగు దేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్ర బాబు నాయుడు అన్నారు.  ఆ వరద తనపై వ్యక్తిగత కక్ష తో తెచ్చిపెట్టినదని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.  తనను ముంచాలనే రహస్య అజెండా తోనే ఈ కృత్రిమ వరద సృష్టించినట్లు స్పష్టంగా అవగతమవుతున్నదని ఇలాంటి కవ్వింపు చర్యలకు బెదిరిపోయేది లేదని శ్రీ చంద్ర బాబు నాయుడు స్పష్టం చేసారు.

ఈ వరద తరువాత తాను పలు గ్రామాల్లో పర్యటించానని ప్రజల పరిస్థితి చుస్తే చాలా బాధగా వున్నదని, వేల ఎకరాలు నీట మునిగిపోయి, ఎన్నో ఇళ్లు కొట్టుకుపోయి ప్రజలంతా తీవ్రంగా దుఃఖిస్తున్నారన్నారు.

వరద ముంపుకు గురైన ప్రాంతాల గురించి ముఖ్యమంత్రి శ్రీ వై స్ జగన్ మోహన్ రెడ్డి పట్టించుకోక పోవడం ఆయన బాధ్యతారాహిత్యానికి  నిలువెత్తు నిదర్శనమన్నారు.  బాధతో విలవిలలాడుతున్న ప్రజల కోసం ఆలోచించకపోవడం ఏమిటని చంద్ర బాబు నాయుడు ప్రశ్నించారు.  బ్యారేజిలలో నీటి నిల్వల రికార్డు పరిశీలించకుండా నీటిని దిగువకు వదలడం ద్వారా భారీ విపత్త్తుకు కారకులయ్యారన్నారు.   

వేల కోట్ల రూపాయలు నష్ట పోయిన ఈ వరదల లో రైతులకు సత్వరమే నష్టపరిహారం చెల్లించాలని  డిమాండ్ చేసారు.

వరదలు వచ్చాయని రాజధానిని వేరొక ప్రాంతానికి తరలించడం వినటానికి విడ్డురంగా వున్నదని చంద్ర బాబు నాయుడు అన్నారు.  అక్కడ మరొక ఉపద్రవం వస్తే ఏమిచేస్తారని ప్రశ్నించారు.

సముద్రం లో కలిసిపోయే నీటిని రాష్ట్రావసరాలకు ఎందుకు వినియోగించుకోలేక పోతున్నామో అర్ధం కావడం లేదని శ్రీ చంద్ర బాబు నాయుడు బాధ పడ్డారు.  ఈ వరదల వల్ల జరిగిన నష్టానికి ప్రజలకు సమాధానం చెప్పవలసి ఉంటుందని ఆయన హెచ్చరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: